కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

ప్రముఖ బైక్ తయారీ సంస్థ Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త Classic 350 బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Royal Enfield Classic 350 ధర రూ. 1.84 లక్షలు. కంపెనీ ఇప్పుడు ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభించింది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

కొత్త Classic 350 బైక్ కొత్త ఇంజిన్, అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఈ కొత్త క్లాసిక్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 యొక్క J ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. కాబట్టి దీనిలో మీటియోర్ 350 యొక్క ఇంజిన్ ఉపయోగించబడింది. అయితే, కొత్త క్లాసిక్ 350 యొక్క స్టైలింగ్ పాత మోడల్ మాదిరిగానే ఉంచబడింది, అయితే ఇందులో చాలా మార్పులు గమనించవచ్చు.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్‌ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్‌ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్‌ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

కొత్త Classic 350 బైక్‌ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. కావున కొత్త అవతార్‌లోని క్లాసిక్ 350 బైక్ 11 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి - క్రోమ్ రెడ్, క్రోమ్ కాంస్య, డార్క్ స్టీల్త్ బ్లాక్, డార్క్ గన్‌మెటల్ గ్రే, సిగ్నల్స్ మార్ష్ గ్రే, సిగ్నల్స్ శాండ్‌స్టార్మ్, హాల్‌సియోన్ గ్రీన్, హాల్సియోన్ బ్లాక్, హాల్సియోన్ గ్రే, రెడిచ్ గ్రీన్ మరియు రెడిచ్ గ్రే. డార్క్ ఎడిషన్ మోడల్ బ్లాక్ మ్యాట్ పెయింట్‌తో అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఇష్టపడే బైక్ బ్రాండ్ లో Royal Enfield Classic 350 ఒకటి. ఈ బైక్ 2020 మార్చి నుండి 2021 ఏప్రిల్ మధ్య అంటే గత ఆర్థిక సంవత్సరం మధ్య 3.60 లక్షలకు పైగా అమ్మకాలను సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఈ బైక్ కొత్త మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది, కాబట్టి రాబోయే రోజుల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త Classic 350 డెలివరీలు షురూ చేసిన Royal Enfield; వివరాలు

Royal Enfield యొక్క ఆగష్టు 2021 అమ్మకాల విషయానికి వస్తే, ఇది మొత్తం 45,860 యూనిట్లను (దేశీయ అమ్మకాలు & ఎగుమతులు) విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాలు 2020 ఆగష్టులో విక్రయించిన దానికంటే 9 శాతం తక్కువ. అయితే గత నెలలో దేశీయ అమ్మకాలు 18 శాతం తగ్గినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి కంపెనీ యొక్క అమ్మకాలు వృద్ధి చెందినట్లు తెలుస్తుంది.

Image Courtesy: Pratip Vlogs

More from DriveSpark

Article Published On: Saturday, September 4, 2021, 12:07 [IST]
English summary
New royal enfield classic 350 delivery starts details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+