రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను రేపు (ఫిబ్రవరి 11) మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన చిత్రాలు, వివరాలు వెల్లడయ్యాయి.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ కొత్త మోడల్‌కు సంబందించి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన అప్‌గ్రేడ్, ఇందులో కొత్తగా రాబోతున్న ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మీటియోర్ 350 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన తరహాలోనే, ఈ కొత్త హిమాలయన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో కూడా బ్లూటూత్ మరియు జిపిఎస్ ఆధారిత టర్న్ బై టర్న్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించనున్నారు.

MOST READ:తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ఈ బైక్‌పై సుదూర ప్రయాణాలు చేసే వారు లేదా కొత్త ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రైడర్లు తమ మొబైల్ ఫోన్ సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయి టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను పొందవచ్చు.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఇందుకోసం కొత్త 2021 హిమాలయన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మార్పుల చేశారు. ఇందులోని గుండ్రటి సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి పక్కనే ఓ గుండ్రటి టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్‌ను అమర్చనున్నారు. దీని సాయంతో రైడర్ జిపిఎస్ నావిగేషన్‌తో పాటుగా బైక్‌కు సంబంధించిన మరిన్ని ఇతర వివరాలను కూడా రిమోట్‌గా తెలుసుకోవచ్చు.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఈ ఒక్క ఫీచర్ కారణంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ పూర్తి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఇక ఇందులోని ఇతర మార్పుల విషయానికి వస్తే, రైడర్ మరియు పిలియన్ రైడర్ కంఫర్ట్ కోసం ఇందులోని సీట్లను కూడా రీడిజైన్ చేశారు.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఎత్తైన రైడర్లను దృష్టిలో ఉంచుకొని, ముందు వైపు ఫుట్ ర్యాక్‌ని కూడా రీడిజైన్ చేశారు. అదనపు లగేజ్‌ను క్యారీ చేయటం కోసం దీని ముందు మరియు వెనుక లగేజ్ క్యారియర్లలో మార్పులు చేశారు. రైడర్ మోకాలితో సంబంధాన్ని నివారించడానికి ఈ కొత్త మోటారుసైకిల్ ముందు భాగంలో తక్కువ క్యారియర్ ఉంటుంది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఇకపోతే, వెనుక భాగంలో ఉన్న లగేజ్ ర్యాక్‌ను ఇప్పుడు మరింత లోడ్ మోయడానికి వీలుగా ఫ్లాట్ మెటల్ ప్లేట్‌తో తయారు చేశారు. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, కొత్త హిమాలయన్ మోడల్‌లో ఇప్పుడు రైడర్‌పై వాయు పీడనాన్ని తగ్గించడానికి ఇందులో మరింత పొడవైన విండ్‌షీల్డ్‌ను జోడించారు.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, కస్టమైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా రైడర్లు కావాలనుకుంటే, తమ కొత్త హిమాలయన్ మోటార్‌సైకిల్‌ను కూడా అందుబాటులో ఉన్న వివిధ రకాల యాక్ససరీలతో కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఈ మార్పులతో పాటుగా కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ సరికొత్త కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. మునుపటి వెర్షన్‌లో ఉపయోగించినే ఈ కొత్త మోడల్‌లోనూ కొనసాగించనున్నారు.

రేపే కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ విడుదల, డీటేల్స్

ఇందులోని 411సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2021 Royal Enfield Himalayan Launch Scheduled On 11th February 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X