భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల తన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ను జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. జాపనీస్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొన్ని అప్డేట్స్ పొందుతుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

వాహన ప్రియులు ఎంతగానో ఇష్టపడే బైక్ బ్రాండ్స్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఈ కారణంగానే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇది తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన టోక్యో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను జనవరి 2021లో ప్రారంభించింది. కంపెనీ తన పరిధిని ఇప్పుడు జపాన్ మార్కెట్లో విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పటికే 2021 లోనే భారతీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ ఆధునిక బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు ఆధునిక పరికరాలను పొందుతుంది, కావున బైక్ రైడర్లకు చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ మూడు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్ మరియు గ్రానైట్ బ్లాక్ కలర్స్.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ కూడా పొందుతుంది, కావున ఇది రియల్ టైమ్ నావిగేషన్‌ను అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొన్ని ఆధునిక కాస్మొటిక్ మార్పులను పొందుతుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇందులో కొంత పొడవైన విండ్‌షీల్డ్, ట్యాంక్ గార్డ్‌పై సవరించిన డిజైన్, మెరుగైన సీట్ కుషనింగ్ మరియు లగేజ్ క్యారియర్‌పై అదనపు ప్లేట్‌ని పొందుతుంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది, కావున చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్స్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్‌డ్రాప్ షేప్ టర్న్ ఇండికేటర్స్ మరియు అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ లో అందుబాటులో ఉన్న కొత్త ట్రిప్పర్ నావిగేషన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. దీని సహాయంతో ఇన్‌కమింగ్ కాల్‌లు మరియు సందేశాలను స్క్రీన్‌పై చూడవచ్చు. కావున రైడింగ్ లో వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బ్లూటూత్ సహాయంతో యాప్‌కి కనెక్ట్ చేయబడింది. దీనివల్ల డైరెక్షన్ కోసం మొబైల్ స్క్రీన్ అవసరం ఉండదు. ఇవన్నీ కూడా రైడర్ కి రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్‌లో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. ఇందులో 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 24 బిహెచ్‌పి పవర్ మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

కంపెనీ నివేదికల ప్రకారం కస్టమర్లు అందించిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఇందులో అనేక మార్పులు చేయబడ్డాయి. ఈ కారణంగా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా మారింది. కావున ఇది ముందుపెటికంటే కూడా ఎక్కువ అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన హిమాలయన్ బైక్ ని 2016 సంవత్సరంలో భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది విడుదలైనప్పటినుంచి కూడా కంపెనీకి ఆశించిన ఫలితాలను తీసుకువచ్చింది. ఇప్పటివరకు కూడా దీనికి మంచి స్పందన వస్తూనే ఉంది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్ మరియు యుకె వంటి దేశాల్లో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ యొక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మాత్రమే కాకుండా, క్లాసిక్ 350 కూడా అద్భుతమైన బైక్. ఈ బైక్ 1 లక్ష యూనిట్ల ఉత్పత్తి మార్కును దాటిందని కంపెనీ ఇటీవల అధికారికంగా తెలియజేసింది.

భారత తీరాలను దాటిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇప్పుడు ఆ దేశంలో విడుదలైంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 యొక్క కొత్త బైక్ ను కంపెనీ ఈ ఏడాది ప్రారంభించింది. ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 భారత్‌తో పాటు యూరప్, దక్షిణాసియా, ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికాలో విక్రయించబడుతోంది. కొత్త క్లాసిక్ 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
New royal enfield himalayan launched in japanese market details
Story first published: Saturday, December 18, 2021, 14:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X