భారత్‌లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2021 విడుదల : ధర & వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు తన కొత్త 2021 హిమాలయన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2021 ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ (చెన్నై) ప్రకారం రూ. 2.01 లక్షలు. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడల్ మూడు కొత్త కలర్ అప్సన్లతో పాటు కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో వస్తుంది.

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో ఓపెన్ చేయబడ్డాయి. బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. 2021 హిమాలయన్ బైక్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2021 దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే అదే డిజైన్ మరియు సిల్హౌట్‌ను ముందుకు తీసుకువెళుతుంది. అయితే, కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఇందులో గమనించవచ్చు. ఇందులో అప్డేట్ చేయబడిన సీట్లు ఉన్నాయి. ఇవి వాహనదారునికి సుదూర ప్రయాణంలో మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో రియర్ క్యారియర్ మరియు ఫ్రంట్ మెటల్ ఫ్రేమ్ మరియు కొత్త విండ్‌స్క్రీన్‌ అప్డేట్ చేయబడి ఉంటుంది.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

కొత్త 2021 హిమాలయన్ బైక్ యొక్క ముఖ్యమైన మార్పు ఏమిటంటే దానిని మూడు కొత్త పెయింట్ స్కీమ్ అప్సన్స్ తో ప్రవేశపెట్టడం. ఈ ఆఫ్-రోడర్ బైక్ ఇప్పుడు పైన్ గ్రీన్, గ్రానైట్ బ్లాక్ మరియు మిరాజ్ సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఈ మూడు కలర్ అప్సన్స్ ప్రస్తుతం ఉన్న గ్రావెల్ గ్రే, రాక్ రెడ్ & లేక్ బ్లూ ఎంపికలతో పాటు అమ్మబడతాయి.

2021 హిమాలయన్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 'ట్రిప్పర్ నావిగేషన్' ను కూడా కలిగి ఉంది. ఈ కొత్త బైక్ లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు కొత్త సింపుల్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పాడ్‌ను కూడా అమర్చారు. కొత్త ట్రిప్పర్ నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ చేత శక్తిని కలిగి ఉంది మరియు బ్లూటూత్ ద్వారా రైడర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌కు మరియు ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా అనుసంధానించబడి ఉంది.

MOST READ:రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు బ్రాండ్ యొక్క 'మేక్-ఇట్-యువర్స్ (MiY) లో భాగంగా ఉంటుంది. ఇది హిమాలయ కస్టమర్లకు వారి మోటారు సైకిళ్లను వ్యక్తిగతీకరించడానికి మరియు వారి అవసరాలకు మరియు ఇష్టాలకు అనుగుణంగా అనుమతిస్తుంది. MiY చొరవ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది ఆర్ఇ యాప్, వెబ్‌సైట్ మరియు డీలర్‌షిప్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

2021 హిమాలయన్ బైక్ లో ఇవి కాకుండా ఇతర మార్పులు చేయలేదు. అప్డేట్ చేయబడిన మోటారుసైకిల్ మునుపటిలాగే అదే బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 411 సిసి సింగిల్ సిలిండర్ SOHC ఎయిర్-కూల్డ్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 24.3 బిహెచ్‌పి మరియు 32 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

మోటారుసైకిల్ ముందు భాగంలో అదే 41 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. ఈ మోటారుసైకిల్ ముందు భాగంలో 21 ఇంచెస్ వీల్ మరియు వెనుకవైపు 17 ఇంచెస్ వీల్ కలిగి ఉంటుంది. ఇఫీ ముందు భాగంలో 90/90 మరియు వెనుకవైపు 120/90 టైర్స్ కలిగి ఉంటుంది.

కొత్త 2021 హిమాలయన్ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే ఇది ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ కలిగి ఉంటుంది. దీనికి డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ మద్దతు ఇస్తుంది. 2021 హిమాలయన్ 'స్విచ్చబుల్ ఎబిఎస్' ను స్టాండర్డ్ గా పొందుతుంది, ఇది గత సంవత్సరం బిఎస్ 6 అప్‌డేట్‌తో మొదట ప్రవేశపెట్టింది.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 2021 భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్-రోడర్ ఎంపికలలో ఒకటి. ఈ కొత్త మోటారుసైకిల్ బిఎండబ్ల్యు జి 310 జిఎస్ మరియు కెటిఎమ్ 390 అడ్వెంచర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త కలర్ అప్సన్లలో విడుదలైన ఈ హిమాలయన్ భారత మార్కెట్లో ఏవిధమైన అమ్మకాలను జరుపుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Royal Enfield Himalayan 2021 Launched In India At Rs 2.01 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X