భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

సేఫ్టీ ఫస్ట్.. కారులో ప్రయాణించేటప్పుడు సీట్‌బెల్ట్ మరియు టూవీలర్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ల తయారీలో ప్రసిద్ధి చెందిన స్టడ్స్ సంస్థ మోటారిస్టుల కోసం ఓ కొత్త హెల్మెట్‌ను విడుదల చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన హెల్మెట్ తయారీ సంస్థ అయిన స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్ తమ కొత్త "క్రెస్ట్" రేంజ్ హెల్మెట్‌లను భారతదేశంలో విడుదల చేసింది. స్టడ్స్ క్రెస్ట్ ఫుల్ ఫేస్ హెల్మెట్‌లో సిలికాన్ కోటెడ్ క్విక్ రిలీజ్ వైజర్ ఉంటుంది. ఇది రెగ్యులేటెడ్ డెన్సిటీ ఈపిఎస్, హైపోఆలెర్జెనిక్ లైనర్, క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్, చిన్ ఎయిర్ వెంట్స్‌తో వస్తుంది.

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

హెల్మెట్ లోపలి భాగంలో మెరుగైన వెంటిలేషన్ కోసం ఇందులో ఎయిర్ ఎగ్జాస్ట్ ఫీచర్ ఉంటుంది. ఇది హెల్మెట్ లోపల వేడి గాలిని బయటకు పంపుతూ, తాజా గాలోని లోపలికి వచ్చే చేస్తుంది. బాహ్య కవచానికి (ఎక్స్‌టర్నల్ షీల్డ్‌కి) అదనపు రక్షణ కల్పించడానికి దీనిని అధిక నాణ్యత గల థర్మోప్లాస్టిక్‌తో తయారు చేశారు.

MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

హై స్పీడ్స్ వద్ద రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ యొక్క ఎయిర్ డ్రాగ్‌ను తగ్గించడానికి దీనిని అత్యుత్తమ ఏరోడైనమిక్ డిజైన్‌తో తయారు చేశారు. హెల్మెట్‌ను తలపై నుండి త్వరగా తీయటం ఇందులో క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్‌ను కూడా ఉపయోగించారు.

హెల్మెట్ లోపల ముఖాన్ని రక్షించడానికి ఇందులో సాఫ్ట్ పాడింగ్‌ను ఉపయోగించారు. స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్ లోపలివైపు సాఫ్ట్ హైపోఅలెర్జిక్ ఫాబ్రిక్ మెటీరియల్‌ను ఉపయోగించారు, తద్వారా ఎక్కువసేపు హెల్మెట్ ధరించిన తర్వాత కూడా అలెర్జీ వచ్చే ప్రమాదం ఉండదని కంపెనీ చెబుతోంది.

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్ రేంజ్ ధరలు రూ.995 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో కంపెనీ అత్యంత సరసమైన మరియు స్టైలిష్ హెల్మెట్‌ను అందిస్తున్నట్లు స్టడ్స్ పేర్కొంది. ఈ హెల్మెట్లను మీడియం (570 మిమీ), లార్జ్ (580 మిమీ) మరియు ఎక్స్‌ట్రా లార్జ్ (600 మిమీ) సైజ్‌లలో విక్రయిస్తున్నారు.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

స్టడ్స్ హెల్మెట్ సంస్థ గత ఏడాది హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆసియా ఖండంలో కెల్లా అతిపెద్ద హెల్మెట్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. సుమారు 5.5 ఎకరాల స్థలంలో ఈ ప్లాంటును నిర్మించారు. ఈ ప్లాంట్‌లో మోటార్‌సైకిల్ హెల్మెట్ల తయారీతో పాటుగా సైకిల్ హెల్మెట్లను కూడా తయారు చేస్తున్నారు.

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

ఈ ప్లాంటులో సంవత్సరానికి 12.5 మిలియన్ బైక్ హెల్మెట్లు మరియు 1.5 మిలియన్ సైకిల్ హెల్మెట్లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ప్లాంట్‌లో తయారు చేసిన హెల్మెట్లను స్టడ్స్ ఎగుమతి కూడా చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ఈ ప్లాంట్‌లో హెల్మెట్లను ఉత్పత్తి చేస్తున్నారు.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

స్టడ్స్ తమ హెల్మెట్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. కాగా, స్టడ్స్ రాబోయే మూడేళ్లలో భారత హెల్మెట్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధిని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లో స్టడ్స్ క్రెస్ట్ హెల్మెట్‌లు విడుదల; ధర మరియు ఫీచర్లు

గత 2018 నివేదిక ప్రకారం, భారత మార్కెట్లో విక్రయించబడే 65-70 శాతం హెల్మెట్లు వ్యవస్థీకృత లేదా ఐఎస్ఐ-సర్టిఫైడ్ హెల్మెట్ తయారీదారుల నుండి వస్తుండగా, మిగిలిన 30 శాతం అసంఘటిత (నాసిరకం) హెల్మెట్ తయారీదారుల నుండి వస్తున్నాయి.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

Most Read Articles

English summary
New Studds Crest Helmet Range Launched In India With New Features, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X