2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ మార్కెట్లో తన కొత్త 2021 హయాబుసా ఇటీవల విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ బైక్ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

కొత్త సుజుకి హయాబుసా యొక్క బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. కొత్త సుజుకి హయాబుసా యొక్క 101 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి, కావున ఇప్పుడు ఈ బైకులు డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయపడింది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

ఈ వీడియోలో గమనించినట్లయితే కొత్త హయాబుసా డీలర్‌షిప్‌కు చేరుకున్న తర్వాత చెక్క బాక్స్ లో ఉంచబడింది. రవాణా సమయంలో ఎటువంటి గీతలు పడకుండా ఇటువంటి ఖరీదైన బైకులకు ఈ విధమైన భద్రత కల్పిస్తారు. ఈ విధమైన భద్రత కల్పించడం వల్ల వీటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

కొత్త హయాబుసా డీలర్‌షిప్‌కు చేరుకున్న తర్వాత, డీలర్షిప్ ఉద్యోగులు ఈ బైక్ ఓపెన్ చేయడం ప్రారంభించారు. డీలర్‌షిప్‌కు చేరుకున్నఈ బైక్ ఆరెంజ్ యాక్సెంట్‌తో వచ్చే హయాబుసా బ్లాక్ కలర్ మోడల్. ఈ హయాబుసా బుక్ చెసుకున్న ఓనర్ దానికి ఎగ్జాస్ట్‌ను కూడా ఆర్డర్ చేశానని, త్వరలో బైక్‌లో ఇన్‌స్టాల్ చేస్తానని చెప్పాడు.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

2021 సుజుకి హయాబుసా ధర రూ. 16.40 లక్షలు. ప్రస్తుతం, కోవిడ్-19 దృష్టిలో, కొత్త సుజుకి హయాబుసా బుకింగ్ ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రారంభించబడింది. కంపెనీ కొత్త సుజుకి హయాబుసాను మూడు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. అవి గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్, మెటాలిక్ మాట్టే స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్ మరియు పెర్ల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ కలర్స్.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

కొత్త సుజుకి హయాబుసాలో 1,340 సిసి, 4-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇందులో ఉన్న ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 187.7 బిహెచ్‌పి మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 299 కిమీ/ గం. పాత మోడల్‌తో పోలిస్తే శక్తి తగ్గినప్పటికీ, దాని పనితీరు మునుపటి కంటే మెరుగ్గా ఉందని కంపెనీ పేర్కొంది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

ఇందులో 6 యాక్సిస్ IMU బేస్డ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటివి ఉంటాయి. దీనికి టూ వే కిక్‌షిఫ్టర్లు మరియు కార్నరింగ్ ఎబిఎస్ కూడా ఉంది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

2021 సుజుకి హయాబుసా, అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ చూడటానికి దాదాపుగా దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. మోటారుసైకిల్‌పై సస్పెన్షన్ డ్యూటీలు ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంటుంది.

హయబుసా బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్‌, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మీద 120/70 సెక్షన్ మరియు 190/50 సెక్షన్ టైర్లను ముందు మరియు వెనుక భాగంలో కలిగి ఉంటుంది.

2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

ఈ కొత్త మోటారుసైకిల్ 20-లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయాబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తోంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

Image Courtesy: Lokesh Swami

More from DriveSpark

Article Published On: Friday, May 28, 2021, 17:28 [IST]
English summary
2021 Suzuki Hayabusa Reaches Dealership. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+