అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త 2021 హయాబుసాను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ 2021 సుజుకి హయాబుసా ధర 16.40 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు భారతదేశం అంతటా ప్రారంభించబడ్డాయి.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కొత్త హయాబుసా యొక్క మొదటి బ్యాచ్‌గా సుజుకి 101 యూనిట్లను విడుదల చేసింది. ఈ యూనిట్లన్నీ అప్పుడే అమ్ముడైపోయాయి. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ బైక్ యొక్క అన్ని యూనిట్లు అమ్మాయుడైపోయాయి.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

అయితే కంపెనీ ఇప్పుడు ఈ సూపర్ బైక్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. రెండవ బ్యాచ్ వచ్చిన తర్వాత బుకింగ్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. 101 యూనిట్ల మొదటి బ్యాచ్ అందుకున్న వినియోగదారులకు రియర్ సీటు కౌల్ ఇవ్వబడుతుంది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

2021 సుజుకి హయాబుసా బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సూపర్ బైక్ దాని స్టాండర్డ్ డిజైన్ ని అలాగే నిలుపుకుంటుంది. ఈ బైక్ యొక్క మొత్తం సిల్హౌట్ అదే విధంగా ఉంచబడుతుంది.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

ఈ 2021 హయబుసాలో ఇప్పుడు ఆల్‌రౌండ్ ఎల్‌ఇడి లైటింగ్ ఉంది. టర్న్-ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

ఈ మోటారుసైకిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అప్డేట్ చేయబడిన ఇంజిన్ ఇప్పుడు తేలికైన పిస్టన్లు, కొత్త కనెక్ట్ రాడ్లు మరియు ఇతర రీ-ఇంజనీరింగ్ అంతర్గత భాగాలను కలిగి ఉంది.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

ఇందులో ఉన్న ఇంజిన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 187.7 బిహెచ్‌పి మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త 2021 హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగవంతం అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 299 కిమీ/ గం.

MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

కొత్త 2021 సుజుకి హయాబుసా మూడు కలర్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్, మెటాలిక్ మాట్టే స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్ మరియు పెర్ల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మాట్టే స్టెల్లార్ బ్లూ కలర్స్.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

కొత్త హయబుసా అప్డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కూడా అందుకుంటుంది. ఇందులో మూడు ఫ్యాక్టరీల ప్రీ-సెట్స్ మరియు మూడు యూజర్-డిఫరబుల్ మోడ్లు, మూడు పవర్ మోడ్లు, మూడు మోడ్లతో లాంచ్ కంట్రోల్ సిస్టమ్ మరియు క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఆల్ఫా ఉన్నాయి.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

ఈ కొత్త బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 10 లెవెల్స్ అడ్జస్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త టిఎఫ్‌టి డిస్ప్లే సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

2021 సుజుకి హయాబుసా, అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ చూడటానికి దాదాపుగా దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. మోటారుసైకిల్‌పై సస్పెన్షన్ డ్యూటీలు ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంటుంది.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

హయబుసా బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్‌, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మీద 120/70 సెక్షన్ మరియు 190/50 సెక్షన్ టైర్లను ముందు మరియు వెనుక భాగంలో కలిగి ఉంటుంది.

అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే ?

ఈ కొత్త మోటారుసైకిల్ 20-లీటర్స్ సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 2021 హయాబుసా ఇప్పుడు మరింత దూకుడుగా కనిపిస్తోంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో చాలా సేఫ్టీగా ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Suzuki Hayabusa First Batch Sold Out. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X