భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

భారతదేశంలో రోజురోజుకి కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు ట్రయంఫ్ మోటార్ సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2021 బోన్నెవిల్లే (Bonneville) శ్రేణి బైకులను విడుదల చేసింది. ట్రయంఫ్ యొక్క కొత్త బోన్నెవిల్లే శ్రేణిలో ఇప్పుడు 6 బైక్‌లు ప్రారంభించబడ్డాయి.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

బోన్నెవిల్లే ప్రారంభించిన ఈ శ్రేణిలో స్ట్రీట్ ట్విన్, స్ట్రీట్ గోల్డ్‌లైన్, టి 100, టి 120, టి 120 బ్లాక్ మరియు స్పీడ్ మాస్టర్ బైక్స్ ఉన్నాయి. ట్రయంఫ్ బోన్నెవిల్లే శ్రేణి బైకులను ఎక్స్‌షోరూమ్ ధర ప్రకారం రూ. 7.95 లక్షల నుంచి రూ. 11.75 లక్షల మధ్య విడుదల చేశారు. ఈ అన్ని బైక్‌లు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కంపెనీ ఎట్టకేలకు ఈ బైక్స్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

సాధారణంగా ట్రయంఫ్ 2001 లో బోన్నెవిల్లే శ్రేణి బైకుల ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత తమ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది. ఈ కొత్త బైకులన్నీ అప్డేటెడ్ ఫీచర్స్ మరియు బీఎస్ 6 అప్‌గ్రేడ్ డిజైన్‌లో మార్పులు చేశారు. ట్రయంఫ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

MOST READ:9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ :

ట్రయంఫ్ కంపెనీ విడుదల చేసిన బైకులలో స్ట్రీట్ ట్విన్ ఒకటి. ఈ బైక్ 900 సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 64 బిహెచ్‌పి శక్తిని, 80 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

ఈ బైక్ బోన్నెవిల్లే శ్రేణిలో అత్యంత సరసమైన బైక్. ఈ బైక్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో స్ప్రింగ్ లోడెడ్ ట్విన్ షాకర్స్ ఉన్నాయి. 2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ ధర రూ .7.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని పాత మోడల్ ధర కంటే రూ. 50,000 ఎక్కువ.

MOST READ:టెస్టింగ్ దశలో ఉన్న సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్; ఒక చార్జితో 240 కి.మీ మైలేజ్

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఫ్యూయెల్ ట్యాంకుపై కొత్త డెకాల్స్, 10-స్పోక్ కాస్ట్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం హెడ్‌ల్యాంప్ బ్రాకెట్లు, కొత్త త్రాటల్ బాడీ కవర్లు మరియు పునఃరూపకల్పన చేసిన రిబ్బెడ్ సీటును పొందుతుంది.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్:

ఈ బైక్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ మోడల్. ఈ బైక్ రూపకల్పన స్ట్రీట్ ట్విన్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇందులో కలర్ మరియు స్టైలింగ్ కొంత మార్చబడ్డాయి. ఈ బైక్ మాట్టే బ్లాక్ కలర్ లో ఆకర్షణీయమైన గోల్డెన్ ఫినిషింగ్ కలిగి ఉంది. ఈ బైక్‌కు 10-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

MOST READ:హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ గోల్డ్‌లైన్ యొక్క 1,000 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తయారు చేయబడతాయి. 2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్ రూ. 8,25,000 ఎక్స్-షోరూమ్ ధర వద్ద ప్రారంభించబడింది.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే టి 100:

ట్రయంఫ్ బోన్నెవిల్లే టి 100 బైక్ 900 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 64 బిహెచ్‌పి శక్తిని, 80 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో టార్క్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ట్రయంఫ్ 3 డి లోగో బైక్ యొక్క ఇంధన ట్యాంక్‌లో ఇవ్వబడింది. ఈ బైక్‌ను ఎక్స్‌షోరూమ్ ధర 9,29,000 రూపాయలు.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే టి 120 & టి 120 బ్లాక్ :

ట్రయంఫ్ బోన్నెవిల్లే టి 120 బైక్ బోన్నెవిల్లే యొక్క అత్యంత క్లాసిక్ వెర్షన్. ఇది మంచి డిజైన్ మరియు స్టైలింగ్ కలిగి ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ కొత్త 3 డి లోగో, పునః రూపకల్పన చేసిన ఇన్స్ట్రుమెంటేషన్, మెషిన్డ్ ఇంజిన్ ఫిన్స్, కాంట్రాస్టింగ్ సీట్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

1200 సిసి ఇంజన్ కొత్త టి 120 మరియు టి 120 బ్లాక్ బైకులలో ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 79 బిహెచ్‌పి శక్తిని, 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బాన్వీల్ బ్రాండింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్యూయల్ రైడింగ్ మోడ్ ఉన్నాయి. బోన్నెవిల్లే టి 120 మరియు టి 120 బ్లాక్ ను ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 10,65,000 వద్ద విడుదల చేశారు.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

2021 ట్రయంఫ్ బోన్నెవిల్లే స్పీడ్ మాస్టర్ :

2021 ట్రయంఫ్ స్పీడ్ మాస్టర్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగైన షోవా సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ బైక్ 47 మిమీ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇది మునుపటి కంటే పెద్దది. ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

కొత్త స్పీడ్ మాస్టర్ 1200 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 77 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 107 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో రూ .11.75 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో ఈ బైక్‌ను లాంచ్ చేశారు.

Most Read Articles

English summary
New Triumph Bonneville Range Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X