భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ బైక్ లాంచ్ ; ధర & వివరాలు

భారత మార్కెట్లో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తమ సరికొత్త టైగర్ 850 స్పోర్ట్‌ బైక్ ను విడుదల చేసింది. ఈ కొత్త ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ రూ. 11.95 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో అందించబడుతుంది. ఈ మోటారుసైకిల్ బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ టైగర్ 900 మోడల్ క్రింద ఉంచబడుతుంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

కొత్త ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ బ్రాండ్ లైనప్‌లో మరింత రోడ్ ఓరియెంటెడ్ ఆఫర్‌గా ఉంటుంది. టైగర్ 900 కు శక్తినిచ్చే అదే ఇంజిన్ యొక్క డి-ట్యూన్డ్ వెర్షన్‌ను ఈ కొత్త బైక్ కలిగి ఉంది. ఇది 888 సిసి ఇన్-లైన్ త్రీ-సిలిండర్ యూనిట్ రూపంలో 8500 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 82 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

కొత్త టైగర్ 850 లోని ఇంజిన్ 1-3-2 ఫైరింగ్ ఆర్డర్‌తో అదే టి-ప్లేన్ క్రాంక్‌ను కూడా ముందుకు తీసుకువెళుతుంది. ఈ ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ తక్కువ ఆర్‌పిఎమ్ లలో ఉన్నతమైన ట్రాక్టాబిలిటీని అందించడానికి అనుమతిస్తుంది. ఇది సిటీ రైడింగ్ ఇబ్బంది లేకుండా చేస్తుంది.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్ మరియు రోడ్ మోడ్స్. ఇది పరిస్థితులకు బాగా సరిపోయేలా త్రాటల్ రెస్పాన్స్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగులను మరింత మారుస్తుంది. టైగర్ 850 స్పోర్ట్ ట్రాక్షన్ కంట్రోల్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే అప్సన్ తో వస్తుంది.

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ఈ సెట్టింగులను 5.0 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇది ఇతర రైడర్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంది. కొత్త ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ దాని పెద్ద టైగర్ 900 వలె అదే చాసిస్ మరియు ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ఇందులో బోల్ట్-ఆన్ అల్యూమినియం రియర్ సబ్-ఫ్రేమ్ ఉంది, ఇది తేలికైన ఇంజిన్‌తో పాటు, మునుపటి తరం టైగర్ 800 ఎక్స్‌ఆర్‌తో పోలిస్తే 7 కిలోల తక్కువ బరువు ఉంటుంది.

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 45 మిమీ యుఎస్డి ఫోర్కులు (180 మిమీ ట్రావెల్) మరియు వెనుక వైపు మోనో-షాక్ సెటప్ (170 మిమీ ట్రావెల్) కలిగి ఉంది.

అదేవిధంగా బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే ఈ అడ్వెంచర్-టూరర్‌ యొక్కబ్రేకింగ్ అనేది బ్రెంబో స్టైల్‌మాస్ ద్వారా, ముందు భాగంలో డ్యూయల్ 320 మిమీ డిస్క్‌ల రూపంలో మరియు వెనుక భాగంలో 255 మిమీ డిస్క్ రూపంలో వస్తుంది. ఇందులో డ్యూయెల్-ఛానల్ ABS కూడా మద్దతుగా ఉంటుంది.

MOST READ:హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

కొత్త టైగర్ 850 ఇరుకైన సీట్లు, ఎర్గోనామిక్‌గా ఆప్టిమైజ్ చేసిన ఫుట్‌రెస్ట్ ప్లేస్ మరియు యాంగిల్ అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్‌లతో వస్తుందని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ పేర్కొంది. టైగర్ 850 స్పోర్ట్‌లోని సీట్లు రెండు-పొజిషన్ హైట్ అడ్జస్ట్ మెకానిజంతో వస్తాయి. టైగర్ 850 స్పోర్ట్ మిచెలిన్ అనాకీ టైర్లపై వరుసగా 19 ఇంచెస్ ముందు మరియు 17 ఇంచెస్ వెనుక రిమ్స్ మరియు 100/90 మరియు 150/70 టైర్ ప్రొఫైల్‌లతో నడుస్తుంది.

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

మోటారుసైకిల్ 20 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్ ఒక లీటర్ కి దాదాపు 19.23 కి.మీ పరిధిని అందిస్తుంది. కొత్త ట్రయంఫ్ టైగర్ 850 చుట్టూ ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఐ బ్రో ఆకారంలో ఉన్న డిఆర్ఎల్ లు, టైల్ లైట్స్ మరియు ఇండికేటర్స్ తో కూడిన హెడ్‌ల్యాంప్‌లు ఇందులో ఉన్నాయి.

MOST READ:అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ట్రయంఫ్ టైగర్ 850 మరియు 900 మోడల్‌ల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడటానికి, కొత్త ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ కొత్త బాడీ గ్రాఫిక్‌లతో పాటు వేరే పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు డ్యూయల్-టోన్ అప్సన్స్ ఉన్నాయి. అవి గ్రాఫైట్ / డయబుల్ రెడ్ మరియు గ్రాఫైట్ / కాస్పియన్ బ్లూ.

భారత్‌లో ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్ ; వివరాలు

ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ ఆఫర్. ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ నుండి కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Triumph Tiger 850 Sport Adventure-Tourer Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, February 9, 2021, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X