కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ 110సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్'లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

మార్కెట్లో కొత్త 2021 ఎడిషన్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ ధర రూ.68,465 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో అందుబాటులోకి వచ్చింది.

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

కొత్త స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్ ఇప్పుడు రెడ్-బ్లాక్ డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్‌లోని ఇంజన్‌ను కూడా ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశారు. ఈ టెక్నాలజీ వలన ఇది మునుపటి కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

టీవీఎస్ అందిస్తున్న తమ పాపులర్ అపాచీ సిరీస్ మోటార్‌సైకిళ్లలో కూడా ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మునుపటి స్టార్ సిటీ ప్లస్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ 15 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ కొత్త 2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అందిస్తున్నారు. ఇంకా ఇందులో యుఎస్‌బి మొబైల్ ఛార్జర్ ఆప్షన్‌ను కూడా ప్రొవైడ్ చేశారు. టీవీఎస్ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2021 ఎడిషన్ స్టార్ సిటీ ప్లస్ ఈ బ్రాండ్ యొక్క 15 సంవత్సరాల వారసత్వంతో నిర్మించబడింది మరియు ఇది ఇప్పటి వరకు 30 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యింది.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఇరువైపులా 17 ఇంచ్ అళ్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చబడి ఉంటాయి.

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఇప్పుడు ఈ కొత్త 2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌లో ముందు వైపు రోటో-పెటల్ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. డిస్క్ బ్రేక్ వేరియంట్‌లో ముందు వైపు సింగిల్ డిస్క్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్ స్టార్ సిటీ ప్లస్ ధర రూ.2,600 అధికంగా ఉంటుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.65,865గా ఉంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.68,465 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిళ్లలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ వేరియంట్ కూడా ఒకటి.

కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

కొత్త 2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ వేరియంట్ బిఎస్6 109సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

Most Read Articles

English summary
New TVS Star City Plus Disk Brake Variant Launched, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X