రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా ఇండియా, తమ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ మోటార్‌సైకిల్‌లు రేపు (శుక్రవారం) భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ఈ బ్రాండ్‌కు భారత మార్కెట్లో మొట్టమొదటి రెట్రో-స్టైల్ మోటారుసైకిల్ కానుంది.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

యమహా ఈ బైక్‌ను మార్కెట్‌లోని మిగతా అన్ని బైక్‌ల కంటే తక్కువ ధరకు లాంచ్ చేయగలదని విశ్వసిస్తున్నారు. కాబట్టి, ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ భారత మార్కెట్లోనే అత్యంత చవకైన రెట్రో-మోడ్రన్ బైక్‌గా అవతరిస్తుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఇది ట్రెడిషనల్ రెట్రో బైక్ కాకపోవచ్చు.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

చూడటానికి ఇది సాధారణ ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వి3 కమ్యూటర్ ఇండియన్-హిప్స్టర్ వెర్షన్‌గా ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో ఇంజన్, ఫ్రేమ్ మరియు కొన్ని విడిభాగాలు ఒకే విధంగా ఉండనున్నాయి. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ 149సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

ఈ ఇంజన్ గరిష్టంగా 12.37 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.6 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందిస్తుంది. ఈ ఇంజన్ 150 నుండి 160సిసి రేంజ్‌లో అతి తక్కువ శక్తివంతమైన ఇంజన్‌గా ఉంటుంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ డిజైన్ విషయానికి వస్తే చాలా భిన్నంగా ఉంటుంది.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

యమహా ఇప్పటికే ఆగ్నేయాసియా మార్కెట్ కోసం ఎక్స్ఎస్ఆర్155 అనే బైక్‌ను తయారు చేసింది మరియు యమహా ఈ బైక్ నుండి ప్రేరణ పొంది యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ను డిజైన్ చేసింది. ఈ బైక్‌లో గుండ్రటి ఎల్‌ఇడి హెడ్‌లైట్, మెటల్ హెడ్‌లైట్ మౌంట్ బ్రాకెట్, టియర్-డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్ మరియు ఫ్లాట్ స్టబ్బీ సీట్ ఉంటుంది.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

యమహా ఎక్స్ఎస్ఆర్155 బైక్‌లో ఈ డిజైన్ అంశాలన్నింటినీ గమనించవచ్చు. ఈ బైక్ యొక్క అధికారిక బుకింగ్‌లను కంపెనీ ఇంకా ప్రారంభించలేదు, రేపు ఇందుకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనధికారికంగా యమహా డీలర్లు ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ బైక్‌ను యమహా డీలర్‌షిప్ ద్వారా రూ.1,000 నుండి రూ.5,000 వరకు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ పరిమాణం విషయానికి వస్తే, దీని పొడవు 2,020 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1,115 మిమీగా ఉంటుందని సమాచారం.

రేపే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు వివరాలు

మీ అవగాహన కోసం, యమహా ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ పొడవు, వెడల్పు మరియు ఎత్తు గణాంకాలు వరుసగా 1,990 మిమీ x 780 మిమీ x 1,080 మిమీగా ఉంటాయి. ప్రస్తుతం, కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర గురించి ఇంకా సమాచారం రాలేదు, అయితే కంపెనీ దీనిని రూ.1.15 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేయగలదని విశ్వసిస్తున్నారు.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
New Yamaha FZ-X Motorcycle Launch Scheduled For Tomorrow; All Details You Wanted To Know. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X