Just In
- 1 hr ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Movies కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డీలర్‌షిప్‌కి చేరుకున్న కొత్త యమహా FZ-X.. డెలివరీస్ ఎప్పుడంటే?
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా ఇండియా, తమ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ను ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ మోటారుసైకిల్ కొత్త టెక్నాలజీల హోస్ట్ మరియు రెట్రో-రోడ్‌స్టర్ డిజైన్‌ను కలిగి ఉంది.
కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ అదే సిరీస్ యొక్క ఎఫ్‌జెడ్-వి3 మరియు ఎఫ్జెడ్ఎస్ వి3 మోడళ్లకు పైన ఉంది. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ ఇప్పుడు డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించింది. బైక్ డెలివరీ ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎఫ్‌జెడ్-ఎక్స్ స్టాండర్డ్ మరియు ఎఫ్‌జెడ్-ఎక్స్ బ్లూటూత్ వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.16 లక్షలు కాగా, ఎఫ్‌జెడ్-ఎక్స్ బ్లూటూత్ వేరియంట్ ధర రూ. 1.19 లక్షల వరకు ఉంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్టే కాపర్, మాట్టే బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ కలర్స్. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఇది యమహా బ్రాండ్ యొక్క అప్డేటెడ్ మోడల్.
యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,020 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1,115 మిమీ వరకు ఉంటుంది. ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ యొక్క వీల్ బేస్ 1,330 మిమీ వరకు ఉంటుంది.
కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో లేటెస్ట్ రిట్రో డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ రోడ్‌స్టెర్ డిజైన్ కారణంగా ట్యాంకుకు ఫెయిరింగ్ లేదా ట్రిమ్ లేదు. అయితే దీనికి బదులుగా మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.
ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ ఫెండర్లు, ఎగ్జాస్ట్, రిబ్బెడ్ సింగిల్-పీస్ సీట్, రియర్ గ్రాబ్ రైల్, టైర్ హగ్గర్, సింగిల్ పాడ్ ఇన్స్టంట్ క్లస్టర్‌తో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్లు వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న క్లస్టర్ దాని స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడింది.
ఇప్పుడు కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా 'యమహా కనెక్ట్ ఎక్స్' బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్ మరియు ఎస్ఎమ్ఎస్ సందేశాలు మరియు ఇన్కమింగ్ కాల్ వంటి వాటిని కూడా అందిస్తుంది.
ఈ బైక్ లో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ కలిగిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టైల్ లాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాప్ ద్వారా బైక్ లొకేషన్, ఫ్యూయెల్ స్టేటస్,సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు బ్లాక్ ప్యాట్రన్ టైర్లను కలిగి ఉంటుంది.
కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనితో పాటు సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను కూడా ఇందులో ఉంటుంది.
కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ లో ఉన్న 149 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్పి మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
Image Courtesy: MRD Vlogs