భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా, దేశీయ మార్కెట్లో కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగాంగానే యమహా తన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల తేదీ ఇటీవల వెల్లడించింది. భారతదేశంలో విడుదల కానున్న ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం, కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ 2021 జూన్ 18 న ఉదయం 11:00 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రారంభించబడుతుంది. టీవీసీ చిత్రీకరణ సమయంలో ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ యొక్క రహస్య చిత్రాలు బయటపడ్డాయి. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ను భారతదేశంలో అనేకసార్లు టెస్ట్ చేయబడింది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఇంధన ఫ్యూయెల్ ట్యాంక్ తో లేటెస్ట్ రెట్రో రూపాన్ని కలిగి ఉంది. ఈ బైక్ లో రోడ్‌స్టర్ డిజైన్‌తో ట్యాంకుకు ఫెయిరింగ్ లేదా ట్రిమ్ లేదని ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే దీనికి బదులుగా మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ గుండ్రని ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ ఫెండర్లు, ఎగ్జాస్ట్, రిబ్బెడ్ సింగిల్-పీస్ సీట్, రియర్ గ్రాబ్ రైల్, టైర్ హగ్గర్, సింగిల్ పాడ్ ఇన్‌స్టంట్ క్లస్టర్‌తో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న క్లస్టర్ దాని స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడింది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

ఈ కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కావున దీనికి అనుకూలంగా ఉండే ఒక మంచి సీటింగ్ కూడా ఉంటుంది. ఇది విస్తృత హ్యాండిల్ బార్ మరియు ఫుట్‌పెగ్ కలిగి ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2020 మిమీ, 785 మిమీ వెడల్పు మరియు 1115 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ యొక్క వీల్ బేస్ 1330 మిమీ వరకు ఉంటుంది. యమహా ఎఫ్‌జెడ్ -150 బైక్‌లో కూడా ఇలాంటి వీల్‌బేస్ ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనితో పాటు సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను కూడా ఇందులో ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

యమహా కంపెనీ యొక్క కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ నుండి వచ్చిన స్పెషల్ ఆఫర్. ఈ బైక్ చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంది. అంతే కాదు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత కవాసకి డబ్ల్యూ 175 బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Source: Bikewale

More from DriveSpark

Article Published On: Tuesday, June 8, 2021, 9:50 [IST]
English summary
Yamaha FZ-X To Be Launched In India On June 18. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+