R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) దేశీయ మార్కెట్లో కొత్త యమహా ఆర్15 వి4 (Yamaha R15 V4) బైక్ విడుదల చేసిన రెండు నెలల తరువాత ధరలను పెంచింది. కంపెనీ ఈ బైక్ ను మార్కెట్లో రూ. 1,67,800 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధరను ఇప్పుడు ఏకంగా 3,000 రూపాయల వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత యమహా ఆర్15 వి4 ధర రూ. 1,70,800.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

కొత్త Yamaha R15 V4 భారతదేశంలో ఐదు విభిన్న రంగులలో ప్రవేశపెట్టబడింది. అయితే ఈ కొత్త Yamaha R15 V4 బైక్ దాని 155 సిసి ఇంజిన్ పరంగా ఖరీదైన బైక్. కావున ఈ బైక్‌తో వచ్చే ప్రీమియం రైడ్ అనుభవం ఈ సెగ్మెంట్‌లోని మరే ఇతర మోటార్‌సైకిల్‌లోనూ లేదు. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

Yamaha R15 V4 బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మరియు క్విక్ షిఫ్టర్ వంటి కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను పొందుతుంది. ఇది గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మరియు ట్రాక్ మరియు స్ట్రీట్ మోడ్‌తో కొత్త YZF-R1-ప్రేరేపిత LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

Yamaha R15 155 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 19 బిహెచ్‌పి పవర్ మరియు 15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటిలాగా, ఈ ఇంజన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కానీ ఇందులో R15M మరియు రేసింగ్ బ్లూ వేరియంట్‌లు మెరుగైన పనితీరు కోసం క్విక్‌షిఫ్టర్‌ను కూడా పొందుతాయి.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

కొత్త Yamaha R15 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ డిజైన్ పాత మోడల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క డ్యూయల్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఇప్పుడు తొలగించబడింది. ఇది ఇప్పుడు యమహా R7 స్పోర్ట్స్ బైక్ నుండి ప్రేరణ పొందిన LED ల్యాంప్‌తో సింగిల్ పాడ్ LED హెడ్‌లైట్ యూనిట్‌తో భర్తీ చేయబడింది. కావున చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్ మరింత దూకుడుగా ఉండటానికి మంచి ఇంధన ట్యాంక్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్‌ను పొందుతుంది. స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్ ఉన్నప్పటికీ, జపనీస్ బ్రాండ్ R15 సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, కావున ఇది రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

Yamaha R15 V4 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్ మరియు ఎమ్ వేరియంట్. 'M' వేరియంట్ ఇందులో హై-స్పెక్ మోడల్. R15 M బైక్ విభిన్నమైన స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్‌లో వస్తుంది. ఇది విభిన్న డిజైన్ సీటు మరియు గోల్డెన్ బ్రేక్ కాలిపర్‌లను పొందుతుంది. ఈ బైక్‌కు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

2021 యమహా R15 మోనో-షాక్‌తో అప్సైడ్ ఫ్రంట్ ఫోర్క్‌లను ఉపయోగిస్తుంది, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ రెండు చక్రాలపై డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్-ఛానల్ ABS కలిగి ఉంటుంది. మొత్తానికి ఇది వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

ఈ కొత్త యమహా బైక్ స్ట్రీట్ మరియు ట్రాక్ అనే రెండు డిస్‌ప్లే మోడ్‌లతో కూడిన LCD డిస్‌ప్లే యూనిట్‌ను పొందుతుంది. R15 V4.0 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ Y-కనెక్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కాల్ మరియు మెసేజ్, రియల్ టైమ్ మైలేజ్, పార్కింగ్ రికార్డ్, బైక్ లొకేషన్ మరియు రైడ్ హిస్టరీ వంటి మరిన్ని వివరాలను అందిస్తుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

కొత్త యమహా R15 బైక్ భారతదేశంలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందిన మొదటి 155 సిసి బైక్. ఈ బైక్ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా మునుపటి కంటే కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా వరకు అప్డేట్ అయింది. కావున ఎక్కువమంది బైక్ ప్రేమికులను ఈ బైక్ తప్పకుండా ఆకర్షిస్తుంది.

R15 బైక్‌పై ఒక్కసారిగా రూ. 3,000 పెంచిన Yamaha: పూర్తి వివరాలు

ప్రస్తుతం యమహా కంపెనీ ఈ కొత్త 2021 యమహా R15 బైక్ ధరను ఏకంగా 3,000 పెంచడం అనేది, అమ్మకాలపైనే ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తెలియరావాలి. ధరల పెరుగుదల తరువాత ఈ బైక్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచి ఉండాలి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
New yamaha r15 price increased by rs 3000 details
Story first published: Monday, November 15, 2021, 11:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X