కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్ ఆవిష్కరించిన యమహా
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన యమహా తన ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ ద్వారా యూరోపియన్ మార్కెట్లలో 125 సిసి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ ఎమ్‌టి-125, ఆర్125 మోడళ్ల మాదిరిగానే పనిచేస్తుంది.

ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో చాలా హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, గుండ్రని డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్, మర్దాన్ స్టైల్ ఫుల్ ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు ఎల్‌ఇడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో బాడీ ప్యానలింగ్ ఇంజిన్, రేడియేటర్ వంటివి ఉన్నాయి.

ఈ కొత్త బైకులోని కొత్త ఇంజిన్ ఈ బైక్ యొక్క డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 లో రెట్రో అల్యూమినియం బ్రాకెట్లు, టక్ అండ్ రోల్ సీట్లు మరియు పెయింట్ చేసిన మడ్‌గార్డ్‌లు ఉన్నాయి. ఇంకా ఈ బైక్ రెడ్‌లైన్, ఇంపాక్ట్ ఎల్లో, టెక్ బ్లాక్ వంటి కలర్స్ ఉన్నాయి.

ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్‌లో నిఫ్టీ లుకింగ్ డెకాల్స్ బైక్ యొక్క స్పోర్టి ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి. ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌పై సింగిల్-పాడ్ ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్ కి మరింత సమాచారం అందిస్తుంది. ఇందులో డిజిటల్ ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, స్పీడోమీటర్‌తో పాటు గేర్ ఇండికేటర్ మరియు ట్రిప్ ఇండికేటర్ ఉన్నాయి.

యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 లో 124 సిసి లిక్విడ్ కూల్డ్ ఎస్‌ఓహెచ్‌సి మోటారు ఉంటుంది. ఈ ఇంజిన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 బిహెచ్‌పి శక్తిని, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ యూరో 5 కాలుష్య నియమాలకు అనుగుణంగా అప్డేట్ హేయబడి ఉంటుంది. ఇది టార్క్ డెలివరీ కోసం మెరుగైన వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్‌ను కలిగి ఉంది. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ తేలికపాటి డెల్టాబాక్స్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది.

కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 37 మిమీ యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో స్వింగార్మ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ కొత్త బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే దీని ముందు భాగంలో 267 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.

ఈ కొత్త యమహా బైక్ మొత్తం 140 కిలోల బరువు ఉంటుంది. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్‌లో 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ బైక్‌లో 11 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. ఈ కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ త్వరలో యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది.

కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 125 బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ లో అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








