సెకండ్ జనరేషన్ KTM RC 390 స్పోర్ట్స్ బైక్ ఆవిష్కరణ, త్వరలోనే భారత్‌లో విడుదల!
ఇటీవలే కొత్త RC 125 మరియు RC 200 బైక్ లను మార్కెట్లో విడుదల చేసిన ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ (KTM), ఇప్పుడు తాజాగా మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పుడు త్వరలోనే సెకండ్ జనరేషన్ ఆర్‌సి (RC390) స్పోర్ట్స్ బైక్ ని దేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మరికొద్ది నెలల్లో ఈ మోడల్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ కెటిఎమ్ తెలిపింది.

కొత్త 2022 కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC390) బైక్ ప్రారంభానికి ముందే కంపెనీ ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ యొక్క నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను తమ ఇండియన్ వెబ్‌సైట్ లో చేర్చింది. కొత్త తరం KTM RC390 ఇతర RC - సిరీస్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఉంటుంది. పాత కెటిఎమ్ ఆర్‌సి 390 తో పోలిస్తే, ఈ కొత్త తరం సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ డిజైన్ పరంగా పూర్తి మార్పుకు గురైంది.

అంతేకాకుండా, ఇది దాని మునుపటి కంటే 7 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో, హెడ్‌ల్యాంప్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇందులో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా, బైక్ లోని లైట్లు అన్నీ కూడా పూర్తిగా ఎల్ఈడి రూపంలో ఉంటాయి.

ఇది మోటార్‌సైకిల్ యొక్క ఏరోడైనమిక్స్‌పై గాలి నుండి రక్షణ మరియు సహాయాన్ని అందించే కొత్త వైజర్ ను కూడా కలిగి ఉంటుంది. కొత్త KTM RC390 పూర్తిగా రీడిజైన్ చేయబడిన బాడీ వర్క్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది మోటార్‌సైకిల్ యొక్క మొత్తం ఆకర్షణను పెంచే గొప్ప ఫెయిరింగ్ ను కూడా పొందుతుంది.

ఫీచర్ల పరంగా, సెకండ్ జనరేషన్ RC 390 కొత్త బ్లూటూత్ టెక్నాలజీతో కూడిన టిఎఫ్‌టి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది KTM యొక్క మై రైడ్ యాప్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రయాణీకులు ఇందులోని కొత్త స్విచ్ గేర్ సాయంతో మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు ఫోన్ కాల్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఇంకా ఇందులో KTM యొక్క సూపర్‌మోటో ABS మోడ్, కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఆప్షనల్ బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ వంటి అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను కూడా పొందుతుంది. అయితే, యాంత్రికంగా (ఇంజన్ పరంగా) ఈ మోడల్ లో ఎలాంటి మార్పులు లేవు.

ప్రస్తుత కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC390) లో ఉపయోగించిన అదే ఇంజన్ ను కంపెనీ ఈ కొత్త 2022 వెర్షన్ లో కూడా కొనసాగించనుంది. ఈ ఇంజన్ ఇప్పుడు BS VI నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ 373.2 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్ ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 43.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 37 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకటి బిఎస్4 ఇంజన్ తో పోల్చి చూస్తే, ఇది మునుపటి కంటే 1 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ను జనరేట్ చేస్తుంది. అయితే దీని పవర్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త తరం KTM RC390 వచ్చే ఏడాది (2022) ఆరంభంలో భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ మోడల్ యొక్క ధర గురించి ఎలాంటి సూచనలు లేనప్పటికీ, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3 లక్షలు వరకూ ఉంటుందని భావిస్తున్నారు.

ఇంకా ఇందులో అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సెటప్ కూడా కలిగి ఉండవచ్చు, ఇది ట్రాక్-ఫోకస్డ్ మోటార్‌సైకిల్ కాబట్టి, ఈ ఫీచర్ ఇందులో స్వాగతించదగినది. ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌కు కంపెనీ చాలా అవసరమైన అప్‌డేట్ ను ఇస్తున్నందున, ఈ కొత్త తరం 2022 KTM RC 390 మార్కెట్ లో అత్యంత ఎదురుచూస్తున్న లాంచ్ లలో ఒకటిగా మారింది.

మార్కెట్లో KTM RC 390 ఈ విభాగంలో కవాసకి నింజా 300 మరియు టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. కెటిఎమ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ కొత్త తరం RC125 మరియు RC200 మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.82 లక్షల మరియు రూ. 2.09 లక్షలుగా ఉన్నాయి.

ఈ రెండు మోడళ్లలో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసినప్పటికీ, వాటి ధరల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన పెరుగుదల లేకపోవడం విశేషం. కెటిఎమ్ MotoGP రేస్ బైక్‌ల నుండి స్ఫూర్తి పొంది ఈ కొత్త 2021 KTM RC మోటార్‌సైకిళ్లను అప్‌డేట్ చేసింది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








