నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ (KTM) భారత మార్కెట్లో విక్రయిస్తున్న కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC390) బైక్ లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా, కంపెనీ ఈ కొత్త టీజర్ ను తమ సోషల్ మీడియా పేజీలలో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆర్‌సి 390 మోడల్ మొదటి తరానికి చెందినది కాగా, కొత్తగా రాబోయేది రెండవ తరానికి చెందినది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

కెటిఎమ్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో తమ కొత్త RC125 మరియు RC200 మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. మార్కట్లో వీటి ధరలు వరుసగా రూ. 1.82 లక్షలు మరియు రూ. 2.09 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల విడుదల తర్వాత, కంపెనీ ఇప్పుడు తమ నెక్స్ట్ జనరేషన్ RC390 బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త తరం 2022 కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC390) బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ ఈ మోడల్ ను తమ ఇండియన్ వెబ్‌సైట్‌ లో లిస్ట్ చేసింది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

కొత్త తరం 2022 KTM RC390 బైక్ ఈ బ్రాండ్ విక్రయిస్తున్న ఇతర RC - సిరీస్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, పాత తరం కెటిఎమ్ ఆర్‌సి 390 తో పోలిస్తే, ఈ కొత్త తరం సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ డిజైన్ పరంగా పూర్తి మార్పుకు గురైంది. ఈ బైక్ ముందు భాగంలో, హెడ్‌ల్యాంప్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇందులో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా, బైక్ లోని లైట్లు అన్నీ కూడా పూర్తిగా ఎల్ఈడి రూపంలో ఉంటాయి.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే సుమారు 7 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. అలాగే దీని ఫ్రంట్ విండ్‌షీల్డ్ ను కూడా రీడిజైన్ చేశారు మరియు ఇప్పుడు ఇది మరింత ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులోని పెట్రోల్ ట్యాంక్, బాడీ గ్రాఫిక్స్, ఫెయిరింగ్ మరియు రియర్ ఎండ్ డిజైన్ తో పాటుగా ఇతర భాగాలకు కూడా మార్పులు చేయబడ్డాయి. కాబట్టి, ఈ కొత్త బైక్ ఇప్పుడు డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, ఏరోడైనమిక్ పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

ఈ కొత్త తరం 2020 కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ లో మరొక ముఖ్యమైన అప్‌డేట్ ఏంటంటే, ఇది ఇప్పుడు బ్లూటూత్ టెక్నాలజీతో కూడిన టిఎఫ్‌టి డిస్ప్లే యూనిట్ ను కలిగి ఉంటుంది. ఇది KTM యొక్క మై రైడ్ యాప్‌ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రయాణీకులు ఇందులోని కొత్త స్విచ్ గేర్‌ సాయంతో మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు ఫోన్ కాల్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇది బైక్ గురించి రైడర్ కు కావల్సిన సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

అలాగే, ఇందులోని క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్లు మరియు డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఏరియాలను కొద్దిగా సవరించారు. ఈ మార్పులు కొత్త KTM RC390 బైక్‌లో అత్యంత సౌకర్యవంతమైన రైడ్‌లను అందించగలవని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఈ మార్పులు సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. రైడర్ కంఫర్ట్ కోసం బైక్ సీట్ ఎత్తు మరియు వెనుక సీటు ప్యాసింజర్ ఫుట్ ఏరియాలో కూడా చిన్నపాటి మార్పులు చేయవచ్చు.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

ఇంకా ఇందులో KTM యొక్క సూపర్‌మోటో ABS మోడ్, కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఆప్షనల్ బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌ వంటి అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను కూడా పొందుతుంది. అయితే, యాంత్రికంగా (ఇంజన్ పరంగా) ఈ మోడల్ లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC390) లో ఉపయోగించిన అదే ఇంజన్ ను కంపెనీ ఈ కొత్త 2022 వెర్షన్ లో కూడా కొనసాగించనుంది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

ఈ ఇంజన్ ఇప్పుడు BS VI నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ 373.2 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 37 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకటి బిఎస్4 ఇంజన్ తో పోల్చి చూస్తే, ఇది మునుపటి కంటే 1 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ను జనరేట్ చేస్తుంది. అయితే దీని పవర్‌ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

నెక్స్ట్ జనరేషన్ 2022 KTM RC390 టీజర్ లాంచ్.. త్వరలోనే విడుదల!

రైడింగ్ డైనమిక్‌లను మెరుగుపరచడానికి, కొత్త KTM RC390 బైక్‌లో స్లిప్పర్ క్లచ్ మరియు బై-డైరెక్షనల్ క్విక్ గేర్‌బాక్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇంకా ఇందులో ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందువైపు 320 ఎమ్ఎమ్ మరియు వెనుకవైపు 230 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండు డ్యూయల్-ఛానల్ Bosch ABS సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Next generation ktm rc 390 teaser out design features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X