ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు నెక్జు (NEXZU) మొబిలిటీ కొత్త సూపర్ లాంగ్ రేంజ్ రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ స్పెషాలిటీ ఏమిటంటే, ఈ సైకిల్ కేవలం ఒకే ఛార్జీపై దాదాపు 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

నెక్జు కంపెనీ ఈ కొత్త రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ కి మంచి డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ అందించింది, అంతే కాకుండా ఇది తేలికైన ఫ్రేమ్ కలిగి ఉంది చాలా ఆకర్షణీయంగా కనిస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ తో పాటు ఇంజినీరింగ్ రూపకల్పన ఇందులో కనిపిస్తుంది.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

ఈ కొత్త రోడ్‌లార్క్‌ ఎలక్ట్రిక్ సైకిల్ లో డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ ఉంది. ఇందులో మొదటిది 8.7Ah బ్యాటరీ, ఇది లైట్ అండ్ డిటాచబుల్ బ్యాటరీ. ఇక రెండవ బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5.2Ah ఫ్రేమ్ బ్యాటరీ, హోమ్ సాకెట్‌ సహాయంతో ఛార్జ్ చేయబడుతుంది.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీని కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. నెక్జు రోడ్‌లార్క్ సైకిల్ పాడిల్ మోడ్‌లో 100 కిలోమీటర్ల వరకు, త్రాటల్ మోడ్‌లో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క టాప్-స్పీడ్ గురించి అందించిన సమాచారం ప్రకారం, ఈ ఇ-సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని తెలిపింది. ఈ సైకిల్ తో నగరంలో లేదా రద్దీ ప్రదేశాలలో కూడా చాలా సులభంగా వెళ్ళవచ్చు.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

రోడ్‌లార్క్‌ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో డ్యూయల్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఫ్రంట్ సస్పెన్షన్‌ను అందించింది. అంతే కాకుండా ఫుల్ ఫెండర్‌లను మరియు అనేక రిఫ్లెక్టర్లను ఉపయోగించింది. ఇందులో అనుకూలమైన రైడింగ్ కోసం పెద్ద సీటు కూడా ఇవ్వబడింది. కానీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో గేర్ సిస్టం లేదు.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

కొత్త నెక్జు రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 42,000 వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ సైకిల్‌ను నెక్జు యొక్క 90 కంటే ఎక్కువ టచ్ పాయింట్ల నుండి లేదా నెక్జు మొబిలిటీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

ఈ కొత్త ఈ-సైకిల్ గురించి నెక్జు మొబిలిటీ సిఓఓ 'రాహుల్ షోనక్' మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లో కొత్త రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసినందుకు చాలా అందంగా ఉందన్నారు. ఇది తేలికపాటి మరియు రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంది, 100 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌తో కూడిన ఈ సైకిల్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు.

ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్; ధర & వివరాలు

నెక్జు రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది భారత మార్కెట్లో విక్రయించే బ్రాండ్ యొక్క ప్రధాన మోడల్. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మంచి పరిధిని అందించడం వల్ల మార్కెట్లో మంచి అమ్మకాలను సాగించే అవకాశం ఉంది. అయితే దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి ఎలాంటి ఆదరణ వస్తుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, April 19, 2021, 19:13 [IST]
English summary
Nexzu Roadlark E-Bike Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+