ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

గత నెలలో రోడ్‌లార్క్ అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రవేశపెట్టిన నెక్స్‌జు మొబిలిటీ, ఇప్పుడు కొత్తగా ఇందులో కార్గో వేరియంట్‌ను విడుదల చేసింది. లాస్ట్ మైల్ మొబిలిటీ కనెక్టివిటీ వాహనంగా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి బ్యాటరీ చార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు రైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

నెక్స్‌జు మొబిలిటీ విడుదల చేసిన ఈ స్టాండర్డ్ వెర్షన్ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.42,000గా ఉంది. కాగా, ఇందులో కార్గో వేరియంట్‌ను కంపెనీ అదే ధరతో విడుదల చేసింది. కార్గో వేరియంట్ కావాలనుకునే వారి కోసం కంపెనీ వివిధ రకాల కస్టమైజబల్ క్యారియర్ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త నెక్స్‌జు రోడ్‌లార్క్ కార్గో వెర్షన్ గరిష్టంగా 50 కిలోల వరకు బరువును మోయగలదు. ఈ వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్. ఈ సైకిల్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

MOST READ:'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

కస్టమర్ అవసరాలకు అనుగుణంగా నెక్స్‌జు రోడ్‌లార్క్ కార్గో వేరియంట్‌ను మార్చుకోవచ్చు. వినియోగదారుల అవసరాలు మరియు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీ అనేక రకాల క్యారియర్ ఆప్షన్లను అందిస్తోంది. వీటిలో బాస్కెట్స్, బ్యాగ్స్ మరియు బాక్సులు కూడా ఉన్నాయి.

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

నెక్స్‌జు రోడ్‌లార్క్ కార్గో డ్యూయల్ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇవి రెండూ మొత్తం రైడ్ రేంజ్‌ను మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఈ రెండు బ్యాటరీలలో ఒకటి 5.2 ఆంపియర్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ. దీనిని శాశ్వతంగా సైకిల్‌కే అమర్చబడి ఉంటుంది.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

కాగా, ఈ రెండు బ్యాటరీలలో మరొకటి 8.7 ఆంపియర్ లిథియం-అయాన్ బ్యాటరీ. దీనిని సైకిల్ నుండి విడిగా వేరు చేసి, చార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 250 వాట్ 36 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఈ మోటార్ సాయంతో ఈ సైకిల్ గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది.

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

నెక్స్‌జు రోడ్‌లార్క్ కార్గో ఎలక్ట్రిక్ సైకిల్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో స్టీల్ ఫ్రేమ్, ఫుల్ ఫెండర్లు, లైట్లు మరియు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి. నెక్సస్ మొబిలిటీ వినియోగదారులు ఇప్పుడు భారతదేశం అంతటా ఉన్న డీలర్‌షిప్‌లలో కానీ లేదా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ కార్గో సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

ఈ సైకిల్‌లోని రెండు బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 3 నుండి 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌ను కోల్డ్-రోల్డ్ స్టీల్ చాస్సిస్‌పై నిర్మించారు. ఫలితంగా, ఇది ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

నెక్స్‌జు రాడ్‌లార్క్ కార్గో ఎలక్ట్రిక్ సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో ఒక స్వింగార్మ్ ఫ్రేమ్ ఉంటుంది. ఈ సైకిల్‌పై బ్రేకింగ్ సిస్టమ్‌ను గమనిస్తే, ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఒక్క చార్జ్‌తో 100 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్; ధర రూ.42,000 మాత్రమే!

రాడ్‌లార్క్ కార్గోలో డిజిటల్ డిస్ప్లేతో పాటు ఫ్లాట్ హ్యాండిల్‌బార్ కూడా ఉంటుంది. ఇది ఛార్జ్ శాతం, ప్రయాణించగలిగే దూరం మరియు అనేక ఇతర వివరాలను ప్రదర్శిస్తుంది. మార్కెట్లో ఈ కార్గో సైకిల్ ధర రూ.42,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
Nexzu Roadlark Cargo Electric Cycle Launched: Price, Features, Range And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X