ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ మైలేజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ బైకులు మరియు ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. దేశంలో రోజువారీ వినియోగానికి ఎలక్ట్రిక్ సైకిళ్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ బైక్‌లతో సమానంగా ఎలక్ట్రిక్ సైకిళ్లు అమ్ముడవుతున్నాయి.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

ఇప్పుడు భారతీయ వాహన తయారీ సంస్థ Nexzu మొబిలిటీ తన కొత్త రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఏకంగా 100 కి.మీ పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా, ఇది మంచి డిజైన్ మరియు పరిమాణం కలిగి ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

Nexzu మొబిలిటీ యొక్క కొత్త రోడ్‌లార్క్ (Roadlark) ఎలక్ట్రిక్ సైకిల్ ధర దేశీయ మార్కెట్లో రూ. 44,083. ఇది ద్విచక్ర వాహన విభాగంలోని అన్ని ఇతర ఉత్పత్తులను అధిగమించేందుకు అనుగుణంగా తయారుచేయబడింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు BLDC 250W 36 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది అసిస్ట్ మోడ్‌లో 100 కి.మీ పరిధిని అందిస్తుంది. Nexzu రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ వరకు ఉంటుంది అని కంపెనీ తెలిపింది.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

Nexzu మొబిలిటీ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పంకజ్ తివారీ కొత్త Nexzu రోడ్‌లార్క్ గురించి మాట్లాడుతూ.. Nexzu రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ఒక అద్భుతమైన ఉత్పత్తి. ఇది ఈ విభాగంలో ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ సైకిల్. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రాబోయే సంవత్సరాల్లో పెట్రోల్ స్కూటర్లు మరియు మోపెడ్‌లను భర్తీ చేసే ఆశాజనక ఆవిష్కరణ. కోవిడ్ మహమ్మారి తర్వాత, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సైక్లింగ్ ఒక అనివార్యమైన ఎంపికగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైకిళ్లను ఉపయోగించడం ప్రారంభించారు.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రస్తుతం సైకిల్స్ ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ సమయంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల కావడం చాలా గొప్ప విషయం. అంతే కాకుండా ఇది ప్రస్తుతం మార్కెట్లో ఎక్కుమందిని ఆకర్షించే ఆకాశం ఉంది, కావున మంచి అమ్మకాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

Nexzu మొబిలిటీకి మధురై, గురుగ్రామ్ మరియు అహ్మదాబాద్‌తో సహా అనేక నగరాల్లో డీలర్‌షిప్‌లు ఉన్నాయి. Nexzu దాని పోర్ట్‌ఫోలియోలో రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఒక ప్రధాన ఉత్పత్తిగా మార్చే అవకాశం ఉంది. దీని సహాయంతో, కంపెనీ తన ఇండియా ఉనికిని విస్తరించాలని చూస్తోంది.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

Nexzu మొబిలిటీ యొక్క ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆర్డర్ చేసుకున్న వారికి కంపెనీ నేరుగా వారి ఇంటివద్దకు డెలివెరీ చేస్తుంది. అంతే కాకుండా భారతదేశంలోని ఏ నగరంలోనైనా వినియోగదారులు Nexzu మొబిలిటీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

భారతదేశ ఆటో మొబైల్ పరిశ్రమ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంపైనే ద్రుష్టి సారిస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ మరియు కార్లను తాయారు చేసి దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. వినియోగదారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

భారతదేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్య ప్రజలపైన ఎక్కువ భారాన్ని మోపుతున్నాయి. ఈ కారణంగా ప్రస్తుతం డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను వినియోగించడానికి ప్రజలు కొంత వెనుకాడుతున్నారు. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ అందించే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర కూడా తక్కువే

ప్రస్తుతం చాలా కంపెనీలు రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ ఉత్పత్తులు విక్రయించబోమని తెలిపాయి. ఇందులో భాగంగానే డీజిల్ మరియు పెట్రోల్ ఉత్పత్తులను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మారుతి సుజుకి కంపెనీ డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేయమని ఇంతకు ముందే స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని బీఎండబ్ల్యూ తెలిపింది.

Most Read Articles

English summary
Nexzu roadlark electric cycle range up to 100 km price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X