అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

భారతదేశంలో రోజురోజుకి టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అనేక కొత్త వాహనాలు ఆధునిక ఫీచర్స్ తో ఆవిష్కరించబడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో భాగంగానే 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటక' (NIT-K) అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన ఒక బైక్ రూపొందించింది. ఈ బైక్ అడవిలో తిరగటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటక (NIT-K), సూరత్కల్, అడవిలో ప్రయాణించడానికి పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ బైక్‌లోని బ్యాటరీని సోలార్ పవర్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో డిటాచబుల్ హెడ్‌లైట్లు కూడా అమర్చబడి ఉంటాయి. కావున వీటిని రాత్రిపూట టార్చ్‌గా ఉపయోగించవచ్చు.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సాధారణంగా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఫర్ సిస్టమ్స్ డిజైన్ మరియు ఇ-మొబిలిటీ ప్రాజెక్ట్స్ హెడ్ పృథ్వీరాజ్ తెలిపారు. అడవిలో ప్రయాణించేటప్పుడు ఎటువంటి సౌండ్ రాదు, అంతే కాకూండా ఈ వాహనం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని వారు తెలిపారు.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

ఈ బైక్ లో మీరు అడవిలో తిరిగేటప్పుడు, వేటగాళ్లు తప్పించుకునే అవకాశం లేకుండా వారిని పట్టుకోవడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. దీని ముందున్న ఒక బాక్స్ లో వాకీ టాకీ, బుక్ సహా అనేక వస్తువులు భద్రపరచుకోవచ్చని కూడా ఆయన అన్నారు.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వెనుక ఉన్న ఒక బాక్స్ లో అడిషినల్ యాక్ససరీస్ ఉంచుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. వేట నిరోధక శిబిరాలు లేదా లోతైన అటవీ ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగకరంగా ఉంటుంది.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటకలోని వాటర్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఓషన్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పార్క్ నిర్వహణకు ఫారెస్ట్ క్లర్క్‌ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కుద్రేముఖ్ నేషనల్ పార్క్‌లో ఉపయోగించేందుకు బైక్‌ను అభివృద్ధి చేసి, ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, దాదాపు 75 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ ఇ-బైక్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. రెండో లాక్‌డౌన్‌ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కొంత వాయిదా పడిందన్నారు. కొత్తగా అభివృద్ధి చేయబడిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు 'ఎలక్ట్రో 4.0'.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో BLDC ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 2.0 kW, 72 వోల్ట్, 33 AH లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయవచ్చు. సోలార్ ఛార్జింగ్ సెటప్‌లో రెండు 400 వాట్ సోలార్ ప్యానెల్ మరియు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 1.5 kW UPS యూనిట్ అందుబాటులో ఉన్నాయి.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

నవంబర్ 17న కుద్రేముఖ్ వైల్డ్ లైఫ్ డివిజన్ నిర్వహించే షోలా ఫారెస్ట్ వర్క్‌షాప్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనున్నారు. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా ఆకర్షనీయంగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి రెసిడెన్షియల్ సొసైటీలు, అపార్ట్‌మెంట్లు, పార్కులు మరియు షాపింగ్ మాల్స్‌లో కూడా ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మిస్తున్నారు.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగం వల్ల దేశంలో కాలుష్యం యొక్క తీవ్రత చాలా ఎక్కువవుతోంది. అయితే ఈ కాలుష్యం యొక్క తీవ్రత ఢిల్లీలో మరింత ఎక్కువగా ఉంది. దీపావళి తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్య నివారణకు చాలా చర్యలు తీసుకుంటోంది.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

ఢిల్లీ నగరంలోని 250 ప్రధాన రహదారులపై ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ నిషేధం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ తాత్కాలిక నిషేధం విధించబడింది మరియు అతిక్రమించే వాహనాలకు భారీ జరిమానా విధించబడుతుందని నివేదించబడింది. పర్యావరణ కాలుష్యాన్ని ఏ విధంగానూ కలిగించని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంది.

అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!

అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే అందుబాటులో ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Nit k develops electric bike for forest use details
Story first published: Wednesday, November 24, 2021, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X