Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్; లైసెన్స్ & రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ధర కూడా చాలా తక్కువ

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలెక్ట్రిక్ వాహనాలు విడుదల చేస్తున్నారు, మరికొన్ని కంపెనీలు విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే భారతదేశంలోని ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ Okaya (ఒకాయ) ఇండియన్ మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Okaya Freedum స్కూటర్; లైసెన్స్ & రిజిస్ట్రేషన్ అవసరం లేదు

Okaya కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్స్ స్కూటర్ పేరు Okaya Freedum (ఒకాయ ఫ్రీడమ్). ఈ కొత్త ఒకాయ ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 69,900 (ఎక్స్-షోరూమ్). Okaya కంపెనీ దేశీయ మార్కెట్లో AvionIQ మరియు ClassicIQ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది.

ఇప్పుడు Okaya కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Okaya Freedum కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ హిమాచల్ ప్రదేశ్‌లోని బద్ది తయారీ కర్మాగారంలో తయారు చేయబడుతుంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Okaya Freedum ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇది 250W BLDC ఎలక్ట్రిక్ మోటార్‌ని ఉపయోగిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ వేగానికి ఈ స్కూటర్ వినియోగించే వినియోగదారునికి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. కావున దీనిని రోజు వారీ ప్రయాణాలకు మరియు నగరంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ మరియు లీడ్ యాసిడ్ బ్యాటరీ అనే రెండు బ్యాటరీ ఆప్సన్స్ లో తీసుకురాబడింది. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయడానికి పట్టే సమయం కేవలం 4 నుంచి 5 గంటలు. అదేవిధంగా ఇందులోని లీడ్ యాసిడ్ బ్యాటరీ మోడల్ పూర్తి ఛార్జ్ కోసం 8 నుంచి 10 గంటలు పడుతుంది.

కంపెనీ నివేదికల ప్రకారం Okaya Freedum స్కూటర్ యొక్క హై-స్పీడ్ మోడల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హై-స్పీడ్ మోడల్ స్కూటర్ ఒక సారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిమీల రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. కావున ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది.

ఇక కంపెనీ యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ కన్సోల్, డిఆర్‌ఎల్‌తో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, రిమోట్ లాక్ మరియు అన్‌లాక్, వీల్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఫార్వర్డ్ మరియు రివర్స్ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

Okaya Freedum స్కూటర్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. కావున ఇవి మంచి పట్టును అందిస్తాయి.

ఈ సందర్భంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హై-స్పీడ్ మోటార్‌సైకిళ్లు మరియు స్పెషల్ B2B వాహనాలతో సహా మొత్తం 14 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కంపెనీకి ప్రస్తుతం 120 మంది డీలర్లను కలిగి ఉంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 800 చేరే అవకాశం ఉంది, దీని కోసం కంపెనీ తగిన సన్నాహాలు చేస్తోంది.

Okaya కంపెనీ 2016-17 నుండి ఎలక్ట్రిక్ వాహనాల కోసం EV ఛార్జర్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ దాదాపు 35 సంవత్సరాల నుండి ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా చురుకుగా ముందుకు వెళుతోంది. ఇటీవల ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరియు అమ్మకాలను పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుతలు వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ద్విచక్ర వాహన అమ్మకాలు చాలా వేగంగా ఉన్నాయి. మార్కెట్లో కొనుగోలుదారులు కూడా ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉండి, తక్కువా ధరకు లభించే స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం వల్ల పర్యావరణ వ్యవస్థ రక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు ఆసరమైన మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ వంటి వాటిని ఏర్పాటు చేసి అభివృద్ధివైపు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. దీని కోసం, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు మరియు వాహన తయారీదారులతో కలిసి పనిచేస్తోంది.

ప్రస్తుతం దేశంలో FAME-2 స్కీమ్ సహాయంతో, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపు ఇస్తోంది, తద్వారా ఎలక్ట్రిక్ అహనా ధరలు చాలా వరకు తగ్గుతాయి, కావున అవి వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంటాయి.

ఇది మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ప్రోత్సహించడానికి, అన్ని బ్యాటరీతో నడిచే వాహనాలపై GST రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించబడింది. ఇది కాకుండా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు మరియు డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు విక్రయాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి.

వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగటానికి మరొక ప్రధాన కారణం, రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంధన ధరలు 100 రూపాయలు దాటాయి. దీనిపై సంబంధిత ప్రభుత్వాలు ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉన్నాయి. ఇది సామాన్య మానవుడిపై ఎక్కువ భారాన్ని మోపుతాయి. కావున ఇటీవల కాలంలో కొనుగోలుదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుహెయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Most Read Articles

English summary
Okaya freedum electric scooter launched price range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X