Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- News
అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది వాహనతయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినవ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా డ్యూయల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను బి 2 బి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా మార్కెట్లో ప్రవేశపెట్టారు.

ఈ ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం కంపెనీ కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా ఇందులో అందించింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ ఒకినావా డ్యూయల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 58,998 రూపాయలు.

భారత మార్కెట్లో ఈ స్కూటర్ జెమోపాయ్ మిసోతో ప్రత్యేకంగా పోటీ పడబోతోంది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది 200 కిలోల వరకు బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున లగేజ్ మోయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

ఈ కొత్త ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ మరియు రియర్ లోడింగ్ క్యారియర్లను కలిగిఉంది. ఇందులో గ్యాస్ సిలిండర్లు, హెవీ హార్డ్‌వేర్ పరికరాలు, వాటర్ క్యాన్లు, కిరాణా, మందులు, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వస్తువులను ఈ క్యారియర్లపై ఉంచుకుని సులభంగా తీసుకెళ్లవచ్చు.

దీని కోసం ఒకినవ డెలివరీ బాక్స్‌లు, స్టాక్ చేయగల డబ్బాలు మరియు కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లు వంటి అనేక అదనపు అనుకూలీకరించదగిన యాక్సససరీస్ కూడా అందిస్తోంది. ఒకినావా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెండు కలర్ అప్సన్లలో అందిస్తుంది. అవి ఫైర్ రెడ్ మరియు షాన్షైన్ ఎల్లో కలర్స్.
MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

ఒకినవ డ్యూయల్ దాదాపు 70% మెటల్ బాడీని ఉపయోగిస్తుందని అంతే కాకుండా కంపెనీ ఉత్పత్తుల్లో 92 శాతం స్థానికీకరించబడిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 2021 నాటికి ఇది 100% చేరుకోవడమే లక్ష్యమని కూడా కంపెనీ పేర్కొంది.

ఒకినవ డ్యూయల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కావున వాహనదారులు ఈ స్కూటర్‌ను నడపడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సి వంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

ఈ స్కూటర్ 48 వాట్ల 55Ah వేరు చేయగలిగిన లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని కేవలం 1.5 గంటల్లో 80 శాతం, 4 నుంచి 5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ కొత్త ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 75 కిలోలు. ఈ స్కూటర్ ఒకే ఛార్జీతో 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఒకినవ డ్యూయెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్లో రిమోట్ ఫంక్షన్, సైడ్ ఫుట్‌రెస్ట్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ మరియు ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. దీనితో పాటు, పుష్-టైప్ పిలియన్ సీట్లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా ఆకర్షనీయంగా ఉంది. ఇది ప్రధానంగా వస్తువులను డెలివరీ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]