ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ప్రముఖ క్యాబ్ సేవల తయారీ సంస్థ ఓలా, తాజాగా మార్కెట్లోకి తీసుకువస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కంపెనీ ఇటీవలే ఈ స్కూటర్ కోసం కేవలం రూ.499 అడ్వాన్సుకే బుకింగ్‌లను ఓపెన్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే లక్ష యూనిట్ల బుకింగ్‌లు వచ్చి పడ్డాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇంకా ఈ స్కూటర్‌కి సంబంధించిన ధర, ఫీచర్లు, మోటార్, బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతేకాదు, ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు ఇంకా దేశవ్యాప్తంగా ఎలాంటి డీలర్ నెట్‌వర్క్ కూడా లేదు. అయినప్పటికీ, కస్టమర్లు మాత్రం దీనిపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ఈ సంస్థ ఇటీవలే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కలర్ ఆప్షన్లను వెల్లడించింది. ఇందుకోసం కంపెనీ తమ సోషల్ మీడియా ద్వారా స్కూటర్ కలర్ ఆప్షన్స్ గురించి ప్రజల నుండి సలహాలను కోరింది. కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క మరొక ఫీచర్ గురించి కంపెనీ ప్రజల సలహాలను కోరుతోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం ఎంత ఉండాలనే విషయంపై ఓలా ఎలక్ట్రిక్ ఛైర్మన్ మరియు గ్రూప్ సీఈఓ భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజల నుండి సలహాలను కోరుతున్నారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గురించి ఓ పోల్‌ని పోస్ట్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

భవీష్ అగర్వాల్ పోస్ట్ చేసిన పోల్‌లో ఎంచుకోవడానికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో మొదటి 80 కిలోమీటర్లు, రెండవది 90 కిలోమీటర్లు, మూడవది 100 కిలోమీటర్లు మరియు నాల్గవది 'డోంట్ కేర్, జస్ట్ వాంట్ ఇట్' అనే ఆప్షన్లు ఉన్నాయి. ఈ పోల్‌ని బట్టి చూస్తుంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాల టాప్ స్పీడ్ ఆప్షన్లతో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ఓలా స్కూటర్ కోసం మీరు టాప్ స్పీడ్ ఎంత ఉండాలని కోరుకుంటున్నారో ఈ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు. ఈ ఓటింగ్ కోసం 24 గంటలు సమయం ఇచ్చారు. ఈ ఓటింగ్ ఆధారంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగాన్ని కంపెనీ త్వరలో వెల్లడిస్తుందని ఊహిస్తున్నారు. కలర్ ఆప్షన్స్‌లో కూడా కంపెనీ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి ఓలా ఇప్పటికే ఓ వీడియోని కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లతో మార్కెట్లో లాంచ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం జూలై 15వ తేదీ నుండి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ఓలా సంస్థ ఈ స్కూటర్ కోసం ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ కేంద్రాలను కలిగి ఉండకుండా, నేరుగా వీటిని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేస్తుందని భావిస్తున్నారు. గతంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌లకు సంబంధించిన కొంత సమాచారం కూడా వెల్లడైంది. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం రెండు పేర్లను ట్రేడ్ మార్క్ చేసింది, వీటిలో ఎస్1 మరియు ఎస్1 ప్రో ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత కావాలనుకుంటున్నారు? 80, 90, 100?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జీతో 100-150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదని ఊహిస్తున్నారు. అదే సమయంలో, దాని అగ్ర వేగం గరిష్టంగా గంటకు 90 కిమీ వరకు ఉంటుందని అంచనా. సూపర్ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 నుండి 2.5 గంటల సమయం పడుతుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగం యొక్క విస్తృత శ్రేణిలో చేరే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ola Chief Asks Suggestion For Top Speed For Its Electric Scooter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X