Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) నెదర్లాండ్స్ ఎంబసీ (నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం) కోసం తొమ్మిది (9) కస్టమైజ్డ్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌లను ప్రత్యేక ఆర్డర్‌పై తయారు చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఓలా ఎలక్ట్రిక్ తయారుచేయనున్న ఈ తొమ్మిది స్కూటర్లు భారతదేశంలోని నెదర్లాండ్స్ యొక్క మూడు దౌత్య కార్యకలాపాలలో ఉపయోగించబడతాయి. ఈ స్పెషల్ స్కూటర్లు నెదర్లాండ్స్ యొక్క అధికారిక రంగు అయిన కస్టమ్ ఆరెంజ్‌ కలర్ లో తయారు చేసి అందించబడతాయి. అంతే కాకుండా ఇవి నెదర్లాండ్స్ అధికారిక లోగోను కూడా కలిగి ఉంటాయి.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఓలా కంపెనీ తయారు చేస్తున్న ఈ స్పెషల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగుకు 'డచ్ ఆరంజ్' అని పేరు పెట్టింది. Ola ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో, కంపెనీ అధునాతన తయారీ మరియు పరిశ్రమ 4.0 ప్రక్రియలను ఉపయోగిస్తుంది, కంపెనీ సజావుగా మరియు కొన్ని రోజుల్లో వారి సాధారణ ఉత్పత్తిలో అంతరాయం లేకుండా నిర్దిష్ట కస్టమర్ అవసరాలకు అనుగుణంగా స్కూటర్‌లను కస్టమైజ్ చేయవచ్చు.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను రాబోయే కొద్ది వారాల్లో భారతదేశంలో డెలివరీ చేయడం ప్రారంభించనుంది. అయితే అంతకు ముందు కంపెనీ కస్టమైజ్డ్ స్కూటర్లను న్యూఢిల్లీలోని నెదర్లాండ్స్ ఎంబసీకి, ముంబై మరియు బెంగళూరులోని కాన్సులేట్‌లకు డెలివరీ చేస్తుంది.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఓలా కంపెనీ ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది. కావున ఇప్పటికే విపరీతమై డిమాండ్ పొందుతోంది. Ola S1 స్కూటర్ అత్యుత్తమ పనితీరు కోసం అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతనమైన మరియు గ్రీన్ టూ వీలర్ కర్మాగారం అయిన ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ఈ స్కూటర్ తయారు చేయబడుతోంది.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఇది Ola కంపెనీ యొక్క గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అయితే Ola ఈ స్కూటర్లను వచ్చే ఏడాది యూరప్, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కావలసిన సన్నాహాలను కంపెనీ సిద్ధం చేసుకుంటోంది.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఈ సందర్భంగా ఓలా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ 'భవిష్ అగర్వాల్' మాట్లాడుతూ, నెదర్లాండ్స్ ఎంబసీ కోసం ఈ కస్టమ్ స్కూటర్‌లను తయారు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నెదర్లాండ్స్ ఎంబసీ వారు మా మిషన్ లో చేరినందుకు మేము గర్విస్తున్నాము అన్నారు, అంతే కాకుండా Ola 2025 తర్వాత, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించాలని దానికోసం సన్నాహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

కంపెనీ తయారు చేస్తున్న ఈ కస్టమ్ స్కూటర్‌లు కంపెనీ యొక్క అధునాతన డిజైన్ టెక్నాలజీ మరియు తయారీ ప్రక్రియకు ఉదాహరణగా ఉన్నాయని, వీటిని మేము కొద్ది రోజుల్లోనే పూర్తిగా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. భవిష్యత్తులో, మేము మా కస్టమర్‌లకు కస్టమ్ పెయింట్ ఫినిషింగ్‌లను అందించడానికి కూడా మేము అవకాశం కల్పిస్తాము. కావున ఆసక్తిగల కస్టమర్లు ప్రత్యేకమైన కలర్ తో ఓలా స్కూటర్ అనుభవించవచ్చు.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). Ola ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల 30 నిముషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను పొందుపరిచింది.

Ola S1 Pro స్పెషల్ కలర్‌లో.. కేవలం వారి కోసం మాత్రమే..!!

Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గురించి మాట్లాడితే, Ola S1 గరిష్టంగా 90 కిమీ/గం కాగా, Ola S1 Pro గరిష్టం వేగం 115 కిమీ/గం. ఇటీవల మేము ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసాము. ఈ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ola electric designs customised scooters for netherland embassy in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X