ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ స్టార్ట్; బుకింగ్ ప్రైస్ రూ. 499 మాత్రమే
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ కంపెనీ ఓలా, దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని విడుదల చేయడానికి సన్నద్దమయిన విషయం తెలిసందే. ఇటీవల కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు వాహనప్రియులకు మరో శుభవార్తను తీసుకువచ్చింది.

ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ అధికారికంగా ప్రారంభించింది. ఇప్పుడు ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలు చెల్లింది బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఓలా కంపెనీ సిఈఓ భవిష్ అగర్వాల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. బుకింగ్ సమయంలో హోమ్ డెలివరీ మరియు స్కూటర్ కలర్ వంటి వాటిని ఎంచుకోవచ్చు.

ఓలా కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్, ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో పేర్లను నమోదు చేస్తుంది. లీకైన కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'సిరీస్ ఎస్' అని పేరు పెట్టె అవకాశం ఉంది. అంతే కాకూండా ఈ స్కూటర్‌ను ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో కూడా అందించే అవకాశం ఉంది.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు. కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో వెల్లడించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పూర్తి ఛార్జీతో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుందని అంచనా.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఉన్న కొన్ని హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో చేరి వాటికి మంచి పోటీని ఇవ్వగలదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ హార్జ్ చేయడానికి స్టాండర్డ్ వాల్ సాకెట్‌పై అమర్చగల హోమ్ ఛార్జర్ అందించబడుతుంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు సమయం పడుతుంది.

ఓలా స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉండనుంది. అంతే కాకుండా ఇది బజాజ్ చేతక్ మరియు టివిఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ డిస్ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ప్రారంభ దశలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ప్లాంట్‌లో తయారు చేయడానికి కావలసిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఆదిమాత్రమే కాకుండా కంపెనీ యొక్క కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ఈ ప్లాంటుకు ప్రతి సంవత్సరం ఏకంగా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

ఈ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడానికి ఈ ప్లాంట్ రోజుకు 25 వేల బ్యాటరీలను తయారు చేయనున్నారు. మేడ్-ఇన్-ఇండియా స్కూటర్లు భారత మార్కెట్లో మాత్రమే కాకుండా యూరప్, ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఓలా స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








