18 నిమిషాల చార్జ్‌తో 75 కి.మీ రేంజ్.. సూపర్‌ఫాస్ట్ చార్జింగ్‌తో ఓలా స్కూటర్!
టాక్సీ సేవల ద్వారా ప్రాచుర్యం పొందిన ఓలా సంస్థ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ పేరుతో భారత మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఈ స్కూటర్‌కి సంబంధించిన చార్జింగ్ టైమ్ మరియు రేంజ్ వంటి వివరాలు వెల్లడయ్యాయి.

ఓలా తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఓలా నుండి రానున్న ఈ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు, చార్జింగ్ సమయం మరియు రేంజ్ (మైలేజ్) వంటి విషయాల్లో ఈ సెగ్మెంట్లోని ఇతర స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

తాజా సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని, ఈ ఛార్జ్‌తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ యొక్క హైపర్ చార్జింగ్ నెట్‌వర్క్‌తో ఇది సాధ్యం కానుంది.

దీన్ని బట్టి చూస్తే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి బ్యాటరీ ఛార్జ్‌తో గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది. అలాగే, సూపర్ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ స్కూటర్‌లోని బ్యాటరీని కేవలం ఒక గంట కన్నా తక్కువ వ్యవధిలోనే చార్జ్ చేసుకోవచ్చని సమాచారం.

కంపెనీ పేర్కొన్నట్లుగా, వాస్తవ ప్రపంచంలో ఈ గణాంకాలు నిజమైతే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలోనే అత్యంత అధిక రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ రేంజ్ పైన పేర్కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దేశంలో తమ కస్టమర్లకు చార్జింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు గానూ, కంపెనీ దేశవ్యాప్తంగా 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.

మొదటి దశలో భాగంగా, ఈ కంపెనీ దేశంలోని 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన సవాలుగా ఉన్న చార్జింగ్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌ను ప్రకటించింది.

ఓలా ఏర్పాటు చేస్తున్న హైపర్‌చార్జర్ సాయంతో ఈ స్కూటర్‌లోని బ్యాటరీలను అత్యంత వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ హైపర్ చార్జర్ సాయంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఓలా హైపర్‌ఛార్జర్ చార్జింగ్ పాయింట్లను దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్, ఐటి పార్కులు, ఆఫీస్ కాంప్లెక్సులు, కేఫ్‌లు మొదలైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే కస్టమర్ల చుట్టూ ఎల్లప్పుడూ ఓలా ఛార్జింగ్ నెట్‌వర్క్ ఉండేలా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ విక్రయించనున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటుగా కంపెనీ ఓ హోమ్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉంటుందని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








