ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి ప్రవేశించిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా క్యాబ్స్ నుండి రాబోయే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు దేశంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఆవిష్కరించిన Ola S1 మరియు Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లు తెగ కొనేస్తున్నారు.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

కంపెనీ ఈ స్కూటర్ కొనుగోళ్లను ఆన్‌లైన్ లో సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి సెప్టెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసింది. కాగా, మొదటి రోజే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్లు రాగా, రెండవ రోజు కేవలం 12 గంటల్లోనే రూ. 500 కోట్ల విలువైన స్కూటర్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ స్యయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లకు ఆర్డర్లు వచ్చాయని, తిరిగి వీటి కోసం బుకింగ్ లను నవంబర్ 1, 2021వ తేదీన ప్రారమభిస్తామని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటి వరకూ విక్రయించిన మొత్తం స్కూటర్ల సంఖ్యను మాత్రం ఆయన తెలియజేయలేదు.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతీయ కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న Ola S1 మరియు Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లను నేరుగా చూడకుండా మరియు టెస్ట్ రైడ్ చేయకుండానే బుక్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే, కస్టమర్లు గుడ్డిగా ఈ బ్రాండ్‌ను నమ్మేస్తున్నారని, తుది ఉత్పత్తిని చూడకుండా మరియు దాని అనుభూతిని పొందకుండానే జేబులు ఖాలీ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

గడచిన జులై నెలలో బుక్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే అక్టోబర్-నవంబర్ నెలల్లో డెలివరీ చేస్తామని, ఆగస్ట్‌లో బుక్ చేసుకున్న వారికి డిసెంబర్-జనవరి నెలల్లో డెలివరీ చేస్తామని మరియు ఇకపై కొత్తగా రిజర్వ్ చేసుకునే కస్టమర్లు వచ్చే ఏడాదిలో డెలివరీలు చేస్తామని కంపెనీ తమ కస్టమర్లు ఎస్ఎమ్ఎస్ ల ద్వారా తెలియజేస్తోంది.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ప్రస్తుతం, మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్షణమే కొనుగోలు చేయటానికి మరియు డెలివరీ పొందటానికి అవకాశం ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం మరికొన్ని నెలలు వేచి ఉండైనా సరే కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనాలని చూస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క సరసమైన ధర, డోర్-స్టెప్ డెలివరీ అండ్ సర్వీస్, లాంగ్ రేంజ్, క్విక్ చార్జింగ్ మరియు విశిష్టమైన ఫీచర్స్ వంటి పలు అంశాల పట్ల కస్టమర్లు ఆకర్షితులు అవుతున్నారు.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో Ola S1 మరియు Ola S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో Ola S1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,29,999 గా ఉంది. ఆకస్తిగల కస్టమర్లు వీటిని కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.499 మొత్తాన్ని చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా రిజర్వ్ చేసుకున్న వారికి స్కూటర్ సేల్స్ ఓపెన్ అయిన తర్వాత కంపెనీ కొనుగోలు చేయటానికి ఓ లింక్‌ను పంపిస్తుంది.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

కస్టమర్లు ఓలా క్యాబ్స్ యాప్ సాయంతో రూ.20,000 అడ్వాన్స్ చెల్లించి తమకు నచ్చిన స్కూటర్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. స్కూటర్ షిప్‌మెంట్‌కి ముందుగా కంపెనీ మిగిలిన మొత్తాన్ని కస్టమర్ల నుండి కలెక్ట్ చేసుకుంటుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కానీ లేదా ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా కానీ చెల్లించవచ్చు. ఫైనాన్స్ ఆప్షన్ కోసం కంపెనీ అనేక ఆర్థిక సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే, ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 75 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక ఆధునిక ఫీచర్లను అందిస్తోంది.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

Ola S1 వేరియంట్ పూర్తి ఛార్జ్‌ పై 121 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, Ola S1 Pro వేరియంట్ పూర్తి చార్జ్ పై 181 కిలోమీటర్ల రేంజ్‌ ను ఆఫర్ చేస్తుంది. ఇందులో మొదటి వేరియంట్ టాప్-స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు కాగా, రెండవ వేరియంట్ టాప్-స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఆగని పరుగు.. రెండు రోజుల్లో రూ.1,100 కోట్లు దాటిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్..

వీటిలో విభిన్న రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఎస్1 స్కూటర్‌లో నార్మల్, స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. ఎస్1 ప్రో మోడల్లో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్ ఉంటాయి. రైడర్ రైడ్ చేసే మోడ్ ని బట్టి టాప్-స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. ఆకర్షణీయమైన లుక్ మరియు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో రూపొందించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మొత్తం 10 రంగులలో (ఎస్1 కోసం 5, ఎస్1 ప్రో కోసం 10) లభిస్తాయి.

Most Read Articles

English summary
Ola electric scooter sales crossed rs 1100 crore in two days details
Story first published: Friday, September 17, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X