స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఓలా కంపెనీ త్వరలో తన బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పటికే చాలా సమాచారం తెలుసుకున్నాం. అయితే ఓలా కంపెనీ ఈ స్కూటర్ ని మార్కెట్లోకి త్వరలో తీసుకువచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను టెస్ట్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వెలువడ్డాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. ఈ స్కూటర్ ఇది వర్క్ మనం అనుకున్న మోడల్ కి సమానంగా ఉంది. ఈ స్కూటర్ లో సౌకర్యవంతమైన సీటు, గ్రాబ్ రైల్, టెయిల్ లైట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చూడవచ్చు, ఇక్కడ మనకు కనిపించే స్కూటర్ వైట్ కలర్ లో ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక హైటెక్ ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌లో డ్యూయల్ పాడ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటివి ఉంటాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఓలా టెస్ట్ చేస్తున్న ఈ స్కూటర్ దాదాపు కవర్ చేయబడి ఉంది. కావున దీనిని గుర్తించలేము. ఈ స్కూటర్ దాదాపు కవర్ చేసి ఉండటం వల్ల దీని గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కొత్త ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఉత్పత్తిని కూడా ఇప్పటికే ప్రారంభించింది. కానీ ఈ స్కూటర్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ డీసీఓటెర్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లో 1 లక్షలు పైగా బుకింగ్స్ అందుకుంది. ఈ స్కూటర్ 10 కలర్స్ లో అందుబాటులోకి రానుంది

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పూర్తి ఛార్జ్ తో 100 కి.మీ నుంచి 150 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్కూటర్ కి హోమ్ ఛార్జర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని స్టాండర్డ్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా ఈ స్కూటర్ మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ స్కూటర్ త్వరలోనే దేశీయ మార్కెయిలో అడుగుపెట్టనుంది. ఈ స్కూటర్ విడుదల సమయంలోనే డెలివరీ గురించిన సమాచారం కూడా అందుబాటులోకి రానుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; త్వరలో విడుదల

కంపెనీ ఇంతకు ముందు అందించిన సమాచార ప్రకారం ఈ స్కూటర్ ని డోర్ డెలివరీ కూడా చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ వద్ద ఉన్న లాజిస్టిక్స్ టీమ్ స్కూటర్ బుకింగ్స్ తెలుసుకుని, దానిని కొనుగోలుదారుడి ఇంటికి చేరుస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో ఈ మోడల్‌ను స్వీకరించిన మొదటి ద్విచక్ర వాహన తయారీదారు కానుంది. ఈ మోడల్ సహాయంతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోని ఏ నగరానికైనా అందించగలదు.

Image Courtesy: kanwar sangha/Twitter

Most Read Articles

English summary
Ola Electric Scooter Spied Testing. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X