నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

Ola కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే కంపెనీ ఇప్పుడు తన S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క టెస్ట్ రైడ్ 2021 నవంబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొనుగోలుదారులు టెస్ట్ రైడ్ చేసిన తరువాత, మొత్తం ధరను చెల్లించి డెలివరీ తీసుకోవచ్చు.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మంచి స్పందనను పొందగలిగింది. అయితే కంపెనీ త్వరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను కూడా ప్రారంభించనుంది. కావున మీకు ఈ స్కూటర్ డెలివెరీ తీసుకోవడానికి ముందుగానే టెస్ట్ రైడ్ చేయవచ్చు.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేసిన తరువాత కూడా బుకింగ్‌ని రద్దు చేసినట్లయితే ఈ మొత్తం డబ్బు కూడా మీకు రీఫండ్ చేయబడుతుంది, కానీ మీరు ఫైనాన్సింగ్‌ను ఎంచుకుని, స్కూటర్ బుకింగ్‌ని రద్దు చేసినట్లయితే, మీరు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

బుకింగ్ సమయంలో ఫైనాన్స్‌ ఆప్సన్ ఎంచుకున్న కస్టమర్‌లకు బుకింగ్ రద్దు చేస్తే కొంత ఖర్చు అవుతుంది. చాలా మంది కస్టమర్‌లు స్కూటర్ కొనడానికి ముందు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నారని, కాబట్టి వారి టెస్ట్ రైడ్ నవంబర్ 10 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఎంత మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారో అనే విషయం తెలుసుకోవడానికి కొంత సమయం వేచి ఉండాలి. కంపెనీ ఈ స్కూటర్ డెలివరీలను త్వరలో ప్రారంభించనుంది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

కంపెనీ ఇది వరకే అందించిన సమాచారం ప్రకారం, దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో టెస్ట్ రైడ్ 2021 అక్టోబర్ 25 నుండి ప్రారంభం కానుందని మరియు మిగిలిన అన్ని నగరాలలో టెస్ట్ రైడ్ తేదీని త్వరలో వెల్లడిస్తానని కంపెనీ తెలిపింది. కానీ అది కూడా ఇప్పకుముద్ వాయిదాపడింది. కావున Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ తేదీని ఖచ్చితంగా వెల్లడికాలేదు.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

అయితే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు డిసెంబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీనిని మీరు కంపెనీ విడుదల చేసిన సమాచారంలో చూడవచ్చు. దీని కోసం, డెలివరీ విండోను 30 రోజులు ఉంచారు, కాబట్టి తుది డెలివరీ తేదీ ఏ విధంగానూ తెలియదు. దీని గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడవుతుంది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2021 ఆగస్టు 15 న Ola S1 మరియు Ola S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో Ola S1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,29,999 గా ఉంది. అయితే కంపెనీ వీటిని ఇంకా డెలివెరీ చేయడం ప్రారంభించలేదు.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

ప్రస్తుతం Ola Electric కంపెనీకి దేశంలో ఎక్కడా ఒక్క డీలర్‌షిప్‌ కూడా లేదు, కావున ఈ టెస్ట్ రైడ్ అనేది ఎలా నిర్వహించబడుతుందో కూడా తెలియాలి. ప్రస్తుతం ఒక్క డీలర్‌షిప్‌ కూడా లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా 1,000 నగరాలకు పైగా విక్రయిస్తుంది. ప్రస్తుతం టెస్ట్ రైడ్ కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే నిర్వహించబడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. తరువాత ఇతర నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహించవచ్చు.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

Ola Electric స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

నవంబర్ 10 నుంచి Ola ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్.. డెలివరీ ఎప్పుడంటే?

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Most Read Articles

English summary
Ola electric scooter test ride to start from 10th november details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X