ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా, మరికొన్ని వారాల్లోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. తాజా, సమాచారం, ప్రకారం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించనుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఓలా నుండి వస్తున్న ఈ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో ఓ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌గా మారనుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేయబోయే 10 ప్రొడక్షన్ లైన్స్ నుండి ప్రతి 2 సెకన్లకు 1 స్కూటర్ చొప్పున ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ప్రస్తతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ సంస్థను పక్కకు నెట్టి, మార్కెట్ లీడర్‌గా ఎదగాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జూన్ 2021 నాటికి దేశీయ విపణిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఈ స్కూటర్‌ను కేవలం భారత మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే భారతదేశంలో ఓ హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా అవతరిస్తుంది. మొదటి సంవత్సరంలో భాగంగా 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ పాయింట్లను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఓలా హైపర్‌చార్జర్ నెట్‌వర్క్ వేగవంతమైన ద్విచక్ర వాహన ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా సెట్ చేయబడింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఓలా హైపర్‌ఛార్జర్ చార్జింగ్ పాయింట్లను దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్, ఐటి పార్కులు, ఆఫీస్ కాంప్లెక్సులు, కేఫ్‌లు మొదలైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే కస్టమర్ల చుట్టూ ఎల్లప్పుడూ ఓలా ఛార్జింగ్ నెట్‌వర్క్ ఉండేలా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇలా వచ్చిన చార్జ్ (50 శాతం చార్జ్)తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై గరిష్టంగా 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీన్నిబట్టి చూస్తుంటే, పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్‌తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

నిజజీవితంలో ఈ గణాంకాలు నిరూపితమైనట్లయితే, ఇది ఈ విభాగంలోనే అత్యధిక రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారుతుంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఈవీ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

తమిళనాడులోని హోసూరులో ఓలా ఎలక్ట్రిక్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ద్వారా 10,000 మందికి పైగా ఉపాధి పొందనున్నారు. ఈ ప్లాంట్‌లో మావన శక్తితో పాటుగా యాంత్రిక శక్తి (రోబోట్ల)ని కూడా ఉపయోగించనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ ప్లాంట్ అవుతుందని నమ్ముతారు. ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నప్పుడు ఇందులో 5,000 రోబోలు మరియు ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాలు ప్లాంట్‌లో ఉపయోగించబడుతాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా కొనుగోలు చేసింది. ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించిన 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్నారు. ఇందులో లాంగ్ రేంజ్ వేరియంట్ గరిష్టంగా 240 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడే కాదు, అక్కడ కూడా..

ఈ స్కూటర్‌లో పోర్టబుల్ బ్యాటరీ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది మరియు దీనిని కేవలం 2.3 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్‌లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి మరియు ప్రతి మాడ్యూల్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ మూడింటినీ కలిపి వినియోగదారులు గరిష్ట పరిధిని పొందవచ్చు. ఈ స్కూటర్‌లో 50 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 5, 2021, 11:19 [IST]
English summary
Ola Electric Scooter To Launch In International Market After India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+