ఎయిర్‌బ్యాగ్స్ కేవలం కార్లకేనా టూవీలర్లకు వద్దా..? టూ-వీలర్ ఎయిర్‌బ్యాగ్‌ను డెవలప్ చేస్తున్న పియాజియో!

వాహనాలలో ఎయిర్‌బ్యాగ్స్ అనేవి సేఫ్టీ విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అత్యవసర సమయాల్లో ఇవి ప్రయాణీకుల ప్రాణాలకు అండగా నిలుస్తాయి. అయితే, ఎయిర్‌బ్యాగ్స్ చాలా వరకూ కార్లు మరియు వాణిజ్య వాహనాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. టూవీలర్లను నడిపే మోటారిస్టులకు ఇటువంటి సేఫ్టీ ఫీచర్ అందుబాటులో లేదు.

గతంలో టూవీలర్ రైడర్ల కోసం ఎయిర్‌బ్యాగ్ జాకెట్లు, ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్లు వంటివి తయారు చేసినప్పటికీ, అవి పెద్దగా ప్రాచుర్యం పొందలేదు మరియు పూర్తిస్తాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో టూవీలర్ రైడర్ల సేఫ్టీ కోసం స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లలో కూడా ఎయిర్‌బ్యాగ్ ఫీచర్ ను అందించాలని ఇటాలిన్ ఆటోమొబైల్ బ్రాండ్ పియాజియో (Piaggio) నిర్ణయించింది.

ఎయిర్‌బ్యాగ్స్ కేవలం కార్లకేనా టూవీలర్లకు వద్దా..?

ఇందులో భాగంగా, ప్రముఖ ఆటోమొబైల్ సెక్యూరిటీ సిస్టమ్స్‌ తయారీ సంస్థ ఆటోలివ్ (Autoliv) తో పియాజియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కూటమి స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లపై ప్రయాణించే వారి భద్రతను మరింత పటిష్టం చేస్తుందని పియాజియో గ్రూప్ భావిస్తోంది. ద్విచక్ర వాహనాలపై సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లను అందించేందుకు ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి.

ఈ రెండు కంపెనీలు ఇప్పటికే టూవీలర్ ఎయిర్‌బ్యాగ్ కాన్సెప్ట్ ను కూడా డిజైన్ చేశాయి. టూవీలర్ ఫ్రేమ్‌పై అమర్చబడి ఉండే ఈ ఎయిర్‌బ్యాగ్ కేవలం మిల్లీసెకన్ల వ్యవధిలోనే ఓపెన్ అవుతుంది. ఈ ఎయిర్‌బ్యాగ్‌లను అభివృద్ధి చేయడానికి పియాజియో మరియు ఆటోలివ్ కంపెనీలు ఓ ఉమ్మడి అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేశాయి. ఆటోలివ్ ఇప్పటికే ఈ టూవీలర్ ఎయిర్‌బ్యాగ్స్ కోసం పూర్తి స్థాయి క్రాష్ పరీక్షలను కూడా నిర్వహించింది.

కేవలం మిల్లీసెకన్లలోనే పనిచేసేలా రూపొందించబడిన ఈ టూవీలర్ ఎయిర్‌బ్యాగ్‌లు వాహనం పైభాగంలో కానీ లేదా హ్యాండిల్‌బార్ ప్రాంతంలో మరియు ఫ్రేమ్ లోపలి భాగంలో సరిపోయేలా ఉంటాయి. ఆటోలివ్ రూపొందించిన ఎయిర్‌బ్యాగ్ కోసం పూర్తి ఘర్షణ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది, ఇది అధునాతన పరికరాలతో ప్రమాదం సమయంలో వాహనంలో ఎలా పనిచేస్తుందో అనుకరిస్తుంది. ఆటోలివ్ ఇప్పుడు ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేయడానికి మరియు కాన్సెప్ట్‌ను వాణిజ్యీకరించడానికి పియాజియో గ్రూప్‌తో కలిసి పని చేస్తుంది.

అయితే, ఈ టూవీలర్ ఎయిర్‌బ్యాగ్స్ అనేవి కాన్సెప్ట్ స్థాయి నుండి ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడానికి మరో ఏడాది కాలం పట్టవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, భవిష్యత్తులో ఈ రెండు కంపెనీల కూటమి నుంచి ద్విచక్ర వాహనాల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు రావడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, ద్విచక్ర వాహన వినియోగదారులకు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ఇది సహాయపడుతుంది.

ఈ సందర్భంగా ఆటోలివ్ సీఈఓ మరియు చైర్మన్ మైఖేల్ ప్రాట్ వ్యాఖ్యానిస్తూ, 2030 నాటికి సంవత్సరానికి 1 లక్ష మంది జీవితాలను రక్షించాలనే తమ లక్ష్యం కోసం ఈ కూటమి ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ద్విచక్ర వాహనాలలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-స్లిప్ కంట్రోల్ (ఏఎస్ఆర్), స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ కాల్ వంటి కొన్ని రకాల సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా సాంకేతికంగా ఓ అడుగు ముందుకు వేసి, తమ ఖరీదైన టూవీలర్ల ముందు భాగంలో రాడార్లను అమర్చడం ప్రారంభించింది. కాబట్టి, సాంకేతిక ఆవిష్కరణలు రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో, త్వరలోనే టూ వీలర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌ లు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, ఈ ఎయిర్‌బ్యాగ్ రైడర్ కు అదనపు రక్షణగా ఉంటుందనేది ఒక్కటే హామీ.

ఎయిర్‌బ్యాగ్స్ కేవలం కార్లకేనా టూవీలర్లకు వద్దా..?

పియాజియో గ్రూప్ మాత్రమే కాదు, ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు మోటార్‌సైకిళ్లకు ఎయిర్ బ్యాగ్స్ డిజైన్ చేసే పనిలో ఉన్నాయి. రాడార్లను అమర్చడం ప్రారంభించిన హోండా కూడా తమ టూవీలర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌ల అభివృద్ధిపై పనిచేస్తోంది. కార్లలో అయితే, ముందు వైపు, ప్రక్కల మరియు మోకాళ్ల దగ్గర ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి, డ్రైవర్ కు అన్ని వైపుల నుండి రక్షణ లభిస్తుంది. మరి ఈ టూవీలర్లలో అమర్చబడే ఎయిర్‌బ్యాగ్స్ ఎంత మేర రైడర్లకు రక్షణగా ఉంటాయనే తెలియాలంటే, మరికొంత కాలం వేచి ఉండక తప్పదు.

ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ-కామర్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్న Jio-BP మరియు Piaggio

ఇదిలా ఉంటే, భారతదేశంలో ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం పలు ఈ-కామర్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు Jio-BP మరియు Piaggio కంపెనీలు ప్రకటించాయి. ఇటాలియన్ ఆటోమేకర్ యొక్క స్థానిక విభాగం అయిన పియాజియో వెహికల్స్ ఇండియా మరియు దాని భాగస్వామి జియో-బిపి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు తమ ఫ్లీట్‌లో కొంత భాగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా (ఈవీ) మార్చడానికి మరియు వాటికి బ్యాటరీని అందించడానికి చర్చలు జరుపుతున్నాయి.

బిజినెస్-టు-బిజినెస్ మోడల్‌లో మౌలిక సదుపాయాలను మార్చడం కోసం ఈ రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది యూరప్, భారతదేశం మరియు ఆసియా అంతటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ద్విచక్ర మరియు త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమగ్ర సేవలను అభివృద్ధి చేయడానికి మరియు రూపొందించడానికి BP Plc మరియు Piaggio గ్రూప్‌ల మధ్య కుదిరిన ప్రపంచ టై-అప్‌లో భాగంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Piaggio and autoliv join hands to develop airbag for scooters and motorcycles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X