ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

భూమిలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించిపోతున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు అనుకూలంగా ఉన్నది మరియు అందరికీ అందుబాటులో ఉన్నది ఎలక్ట్రిక్ పవర్ మాత్రమే. అందుకే, ఇప్పుడు దాదాపుగా ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కూడా బ్యాటరీ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయటంపై దృష్టి సారించాయి.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఈ నేపథ్యంలో, భవిష్యత్తును ఎలక్ట్రిక్ వాహనాల కోసం సిద్ధంగా ఉంచేందుకు ప్రపంచంలోని నాలుగు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు నడుం బిగించాయి. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు మరియు తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం మార్చుకోగలిగిన బ్యాటరీల (స్వాపబల్ బ్యాటరీ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి KTM, Honda మరియు Yamaha సంస్థలతో చేతులు కలిపినట్లు Piaggio Group ప్రకటించింది.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఈ మేరుకు హోండా మోటార్, కెటిఎమ్ మరియు యమహా మోటార్‌ కంపెనీలతో కలిసి స్వాప్ చేయగల బ్యాటరీల కన్సార్టియంను ఏర్పాటు చేసినట్లు పియాజియో గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రయోజనం కోసం మార్చ్ 2021 లోనే KTM (కెటిఎమ్), Honda (హోండా), Yamaha (యమహా) మరియు Piaggio (పియాజియో) కంపెనీలు ఓ కూటమిని ప్రతిపాదించాయి, ఇప్పుడు ఇవి నిజమైన ఒప్పందంలోకి మారాయి.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, ఎలక్ట్రిక్ మోపెడ్‌లు మరియు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ వంటి తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ 'మార్చదగిన బ్యాటరీల మోటార్‌సైకిల్ కన్సార్టియం' (Swappable Batteries Motorcycle Consortium - SBMC) ఏర్పాటు చేయబడింది.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఈ ప్రక్రియ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రదేశాలు లేదా ఎలక్ట్రిక్ టూవీలర్ల చార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండటం ఇష్టం లేని వారు ఈ బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని అనుసరించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో రైడర్లు తమ టూవీలర్ లోని బ్యాటరీని తీసివేసి, పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీని ఇన్‌స్టాల్ చేసుకొని రైడ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

అయితే, ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం చెప్పినంత సులువేమీ కాదు. ఇందు కోసం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలన్నీ కూడా తొలగించగల (రిమూవబల్) బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండాలి. అంతేకాకుండా, ఈ బ్యాటరీలు అన్నీ కూడా ఒకే రూపంలో ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక ఎలక్ట్రిక్ టూవీలర్లు ఫిక్స్డ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఇలాంటి వాటి విషయంలో బ్యాటరీ స్వాపింగ్ విధానం పనిచేయదు.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

బ్యాటరీ స్వాపింగ్ విధానం గురించి హోండా మోటార్‌సైకిల్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫీసర్ యోషిషిగే నోమురా వ్యాఖ్యానిస్తూ.. "వీటిని (ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ లను) పెద్ద ఎత్తున వినియోగించడం వలన ఇది మరింత స్థిరమైన సమాజ నిర్మాణానికి గణనీయంగా దోహదపడుతుందని" ఆయన అన్నారు. మార్చుకోదగిన బ్యాటరీలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం మరింత స్థిరమైన బ్యాటరీ నిర్వహణను అనుమతిస్తాయి.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

బ్యాటరీ జీవితం, రీఛార్జింగ్ సమయం, మౌలిక సదుపాయాలు మరియు ఖర్చులు వంటి సమస్యలపై కూడా ఈ కన్సార్టియం దృష్టి పెడుతుంది. మోపెడ్‌లు, మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్లు మరియు క్వాడ్రిసైకిల్స్, ఎల్ - కేటగిరీలోని వాహనాల కోసం మార్చుకోగలిగిన బ్యాటరీల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక వివరణలను నిర్వచించడంలో కూడా ఇది పని చేస్తుంది.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఈ నాలుగు కంపెనీలు ముందుగా తమ మార్చుకోగలిగిన బ్యాటరీల మోటార్‌సైకిల్ కన్సార్టియం ప్రక్రియను యూరోపియన్ మార్కెట్‌లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత దశల వారీగా దీనిని ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించబడుతుంది. పర్యావరణంలో విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి పారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశించిన లక్ష్యాల నేపథ్యంలో ఈ చొరవ తీసుకోబడింది.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఈ కన్సార్టియం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలను గుర్తించి, మార్చుకోగలిగిన బ్యాటరీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇందులో అన్ని రకాల ఎలక్ట్రిక్ మోపెడ్‌లు, స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్లు మరియు క్వాడ్రిసైకిళ్ల బ్యాటరీలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో ఈ నాలుగు కంపెనీలు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. తగినంత ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఛార్జింగ్ నెట్‌వర్క్ లేకపోవడం వలన ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఇష్టపడరు. కాబట్టి, ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల చార్జింగ్ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు.

ఈవీల కోసం చేతులు కలిపిన టాప్ 4 కంపెనీలు; బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఉన్న అపోహల కారణంగా, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరియు వినియోగం చాలా తక్కువగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో మనదేశంలో ఇలాంటి వాహనాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మరి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో KTM, Honda, Yamaha మరియు Piaggio సంస్థలు ఎలా పనిచేస్తాయో వేచి చూడాలి.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన అన్ని చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించండి.

Most Read Articles

English summary
Piaggio ktm honda and yamaha to set up swappable batteries consortium for electric vehicles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X