1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

ప్రస్తుతం భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో చాలా కొత్త కొత్త బైకులు దేశీయ మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. ఈ కొత్త బైకులు దాదాపుగా అధునాత టెక్నలజీ వంటి వాటిని కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

ఇప్పుడు ఎలాంటి బైకులు వినియోగిస్తారనేది దాదాపు అందరికి తెలుసు, కానీ 1990 లలో ఎలాంటి ద్విచక్ర వాహనాలు దేశీయ మార్కెట్లో వాడుకలో ఉండేవి, వాటి ఫీచర్స్ ఏంటి, అవి ఎటువంటి పరికరాలను కలిగి ఉంటాయి. ఆ సమయంలో ఏ బైకులు అత్యంత ప్రాచుర్యం పొందాయి, అనే మరిన్ని విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Yamaha RX-100 (యమహా ఆర్ఎక్స్-100):

ఇటీవల కాలంలో Yamaha బ్రాండ్ యొక్క బైకులు ఎంత ప్రాచుర్యం పొందాయి, 1990 లలో కూడా ఎనలేని ప్రజాదరణ పొందాయి, అనుటలో ఎటువంటి సందేహం లేదు. 1990 లలో బాగా ప్రాచుర్యం పొందిన బైకు 'Yamaha RX-100'. ఇద్హి కేవలం 1990 లలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా దీనికున్న క్రేజు ఏ మాత్రం తగ్గడం లేదు. యువ రైడర్లకు ఇష్టమైన బైకులలో Yamaha RX-100 కూడా ఒకటి.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Yamaha RX-100 బైక్ ఇప్పటికీ మంచి ధరకు విక్రయించబడుతుంది. Yamaha RX-100 బైకులో 98 సిసి 2 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11 బిహెచ్‌పి పవర్ మరియు 10.39 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉంది. తెలుగులో ఆర్ఎక్స్-100 అనే సినిమాతో ఈ Yamaha RX-100 బైక్ క్రేజు మరింత పెరిగిపోయింది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Bajaj Chetak (బజాజ్ చేతక్):

Bajaj Chetak (బజాజ్ చేతక్) 1990 లలో భారతీయులకు ఇష్టమైన స్కూటర్. ఈ స్కూటర్ ఆ రోజుల్లో కొంత అతి తక్కువ ధరకు లభించడంతో ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ స్కూటర్ ని విపరీతంగా కొనుగోలు చేశారు. Bajaj Chetak ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే "హమారా బజాజ్" అని అందరూ మురిసిపోయేలా. భారతీయ యోధుడు రాణా ప్రతాప్ సింగ్ యొక్క ప్రసిద్ధ గుర్రం పేరు కూడా చేతక్ కావడం మరింత గర్వకారణం.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Bajaj Chetak స్కూటర్‌లో 150 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇంజిన్ 2002 నుండి 2-స్ట్రోక్ మరియు 2002 నుండి 2005 వరకు 4-స్ట్రోక్. ఈ ఇంజన్ 7.5 బిహెచ్‌పి పవర్ మరియు 10.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉంది. ఈ స్కూటర్ యొక్క గేర్లను ఎడమ చేతితో మార్చవలసి వచ్చింది. అయితే ప్రస్తుతం Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ గా కూడా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఇప్పటికి ఒక తిరుగులేని స్కూటర్ గా ప్రజల మనసులో నిలిచిపోయింది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Hero Honda CD 100 (హీరో హోండా సిడి 100):

భారతదేశంలో మొట్టమొదటి అత్యధిక మైలేజ్ అందించే బైకులలో హీరో కంపెనీ యొక్క సిడి 100 ఒకటి. 1990 లలో Chetak, Bullet మరియు Yezdi వంటి బైకులు కొనడానికి ఇష్టపడని వాహనం కొనుగోలుదారులు Hero Honda CD 100 కొండటానికి ఆసక్తి కనపరిచేవారు. ఈ బైక్ మంచి మైలేజ్ ఇవ్వడంతో ఇది ఎక్కువ అమ్మకాలను కైవసం చేసుకుంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

"కిత్నా దేతి హై" అనే ప్రకటనతో ఈ బైక్ మరింత ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించగలిగింది. Hero Honda CD 100 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 97 సిసి 4 స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉండేది. ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.5 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసింది. ఈ బైక్‌లో 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ అందుబాటులో ఉండేది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Kinetic Honda (కైనెటిక్ హోండా):

Kinetic Honda స్కూటర్ 1990 లలో ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్‌తో విడుదలైంద. భారతదేశపు ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్‌ మరియు సివిటి ట్రాన్స్‌మిషన్ కలిగిన మొట్టమొదటి స్కూటర్ Kinetic Honda. Bajaj Chetak స్కూటర్ మార్కెట్లో పాపులర్ అయిన రోజుల్లోనే Kinetic Honda విడుదలైంది. ఆ సమయంలో Bajaj అమ్మకాలు తగ్గి, ఊహించని విధంగా, Kinetic Honda అమ్మకాలు పెరిగిపోయాయి.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Kinetic Honda స్కూటర్ దాని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మిషన్ మరియు శక్తివంతమైన ఇంజిన్ కారణంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో విస్తృత దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్ మరియు ప్రత్యేకమైన స్టైల్ ఫ్రంట్ లుక్ కారణంగా కూడా ,ఆర్కెట్లో మంది ఆధారం పొందింది. ఈ స్కూటర్ 98 సిసి 2-స్ట్రోక్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. కావున ఇది 5,600 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందుబాటులో ఉంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Yamaha RD 350 (యమహా ఆర్‌డి 350):

1990 లలో Yamaha బైక్స్ Yazdi మరియు Jawa బైకులతో పడుతుంది. అయితే ఈ బైక్ యొక్క ఉత్పత్తి 1990 లలోనే నిలిచిపోయింది. దురదృష్టవశాత్తు, ఈ బైక్ ఉత్పత్తి 1990 లో ముగిసింది. మిగిలిన యూనిట్లను కంపెనీ 1991 వరకు విక్రయించబడ్డాయి. ఈ బైక్‌లో 2-స్ట్రోక్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందుబాటులో ఉండేది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

యమహా ఈ బైక్‌కి టార్క్ ఇండక్షన్ సిస్టమ్, రీడ్ వాల్వ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటో ల్యూబ్ సిస్టమ్, మెకానికల్ టాకోమీటర్ మరియు 12 వోల్ట్ ఎలక్ట్రిక్ అందించింది. ఈ బైక్ 4.0 సెకన్లలో గంటకు 60 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఈ బైక్ తక్కువ మైలేజ్, అధిక ధర, ఖరీదైన విడి భాగాలు మరియు శిక్షణ పొందిన సర్వీస్ టెక్నీషియన్లు లేకపోవడం వాళ్ళ దీని ఉత్పత్తి నిలిచిపోయింది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Bajaj Sunny (బజాజ్ సన్నీ):

Bajaj Sunny స్కూటర్ విడుదలైనప్పుడు ఎక్కువమంది యువతను ఆకర్షించగలిగింది. ఇది లైట్ వెయిట్ పెప్పీ స్కూటర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన చిన్న 50 సిసి 2-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ ఉంది. స్కూటర్‌లో 3.5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంది, ఇది గంటకు 50 కిమీ వేగంతో కదులుతోంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 50 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ 120 కిలోల పేలోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంది. 1990 లలో TVS స్కూటీ మరియు Kinetic Honda కాకుండా, ఈ స్కూటర్‌లో ఆటో ఎంగేజ్ గేర్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటర్‌లోని 49 సిసి 2-స్ట్రోక్ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 2.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కొద అందుబాటలో ఉంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Suzuki Samurai (సుజుకి సమురాయ్):

Suzuki Samurai దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. అంతే కాకూండా కస్టమర్ల యొక్క నమ్మకానికి నాందిగా నిలిచింది. Suzuki Samurai ఎక్కువ శక్తితో పెద్ద ఇంజిన్ మరియు అదే స్టైలింగ్‌ని కలిగి ఉంది. ఇది 98.2 సిసి 2-స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Hero Puch (హీరో పంచ్):

ఇండియన్ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన మోపెడ్‌లలో Hero Puch ఒకటి. ఇది చాలా సరళమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా హ్యాండిల్ మరియు సీటు మధ్య ఒక రాక్‌తో పాటు లగేజ్ తీసుకెళ్లడానికి పిలియన్ సీటు కూడా ఉంది. ఈ మోపెడ్ తక్కువ ధర ఉన్న కారణంగా భారతీయ మార్కెట్లో ఒక ఉత్తమమైన ఎంపికగా నిలిచింది. Hero Puch మోపెడ్ 64 సిసి 2-స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 4.2 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

1990 లలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులు; వాటి వివరాలు.. ఇక్కడ చూడండి

Bullet 350 (బుల్లెట్ 350):

1990 లలోనే ఈబులెట్ బండి బాగా ప్రచ్చుర్యం పొందింది. ఈ బైక్ కొంత ధర ఎక్కువయినప్పటికీ ఎక్కువ మంది లగ్జరీగా మరియు హుందాగా వెళ్ళడానికి ఈ బైకులు ఉపయోగించేవారు. ఈ బైకులు 346 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పి పవర్ మరియు 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులన్నీ కూడా 1990 లలో ఒక వెలుగు వెలిగాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి.

Most Read Articles

English summary
Popular two wheelers which ruled the indian roads during 1990 decade details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X