పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్, గ్లోబల్ మార్కెట్లలో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రవేశపెట్టింది. పోర్ష్ టేకాన్ క్రాస్ తురిస్మో స్పోర్ట్స్ కారును ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా విడుదల చేసింది.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

పోర్ష్ ఈబైక్ పేరుతో లభ్యం కానున్న ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లలో కంపెనీ రెండు వేరియంట్లను పరిచయ చేసింది. ఈ సైకిళ్లు స్పోర్ట్ మరియు క్రాస్ అనే వేరియంట్లలో లభ్యం కానున్నాయి. పోర్ష్ ఈబైక్ స్పోర్ట్ ధర 10,700 అమెరికన్ డాలర్లు కాగా, పోర్ష్ ఈబైక్ క్రాస్ ధర 8,549 అమెరికన్ డాలర్లుగా ఉంది.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

అంటే, మన దేశ కరెన్సీలో పోర్ష్ ఎంట్రీ లెవల్ సైకిల్ ధరే సుమారు రూ.6.3 లక్షలుగా ఉంటోంది. ఈ సైకిల్ ధర, మనదేశంలో ఇటీవలే విడుదలైన నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ వంటి కార్ల ధర కంటే కూడా అధికంగా ఉంది. ఇక ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ సైకిల్ ధరైతే మన కరెన్సీలో సుమారు రూ.7.8 లక్షలుగా ఉంటుంది.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

పోర్ష్ విడుదల చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు గ్లోబల్ మార్కెట్లలో మార్చ్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పోర్ష్ స్పోర్ట్ సైకిల్‌ను రెగ్యులర్ సిటీ కమ్యూటర్‌గా రోజూవారీ ప్రయాణాలను ఉద్దేశించి తయారు చేయగా, పోర్ష్ క్రాస్ సైకిల్‌ను మాత్రం ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం తయారు చేశారు.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

పోర్ష్ స్పోర్ట్ ఇ-బైక్:

పోర్ష్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో షిమానో ఇపి8 ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ సైకిల్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల (సుమారు గంటకు 15 మైళ్ల) వేగంతో ప్రయాణించగలదు. ఈ ఇ-సైకిల్‌లో షిమనో గేర్ షిఫ్టర్లను కూడా ఉపయోగించారు.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

ఇంకా ఇందులో మగ్యూరా హై-పెర్ఫార్మెన్స్ బ్రేక్‌లు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయటానికి హ్యాండిల్‌బార్స్‌తో ప్రత్యేకమైన సెటప్ ఉంటుంది. అదనంగా, ఇందులో సూపర్నోవా యొక్క ఎమ్99 ఎల్ఈడి లైట్, హ్యాండిల్ బార్ స్టెమ్ మరియు అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన సీట్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

పోర్ష్ క్రాస్:

పోర్ష్ క్రాస్ ఈబైక్‌లో కూడా షిమానో బ్రాండ్ డెవలప్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇందులో మగ్యురా ఎమ్‌టి ట్రైల్ హై-పెర్ఫార్మెన్స్ బ్రేక్‌లను ఆఫర్ చేస్తున్నారు. వీటి కోసం పెద్ద హీట్ రెసిస్టెంట్ డిస్క్‌లను ఉపయోగించారు.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

అదనంగా, ఈ ఇ-సైకిల్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు అనుగుణంగా, అందుకు సంబంధించిన ఫీచర్లతో డిజైన్ చేశారు. ఈ రెండు మోడళ్లలో కలర్ స్క్రీన్, కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ మరియు హై-రేంజ్ బ్యాటరీ వంటి ఫీచర్లు లభిస్తాయి. ప్రస్తుతానికి ఇవి గ్లోబల్ మార్కెట్లకే పరిమితం అయ్యాయి, వీటి భారత ఎంట్రీ గురించి ఎలాంటి సమాచారం లేదు.

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

పోర్ష్ ఇండియా ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 పనామెరా కారును విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పోర్ష్ పనామెరా సిరీస్‌లో పనామెరా, పనామెరా జిటిఎస్, పనామెరా టర్బో ఎస్ మరియు పనామెరా టర్బో ఎస్ ఇ-హైబ్రిడ్‌తో సహా మొత్తం నాలుగు మోడళ్లు ప్రారంభించబడ్డాయి. - వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Porsche Launches Cross And Sport e-Cycles Globally, Details. Read In Telugu.
Story first published: Tuesday, March 9, 2021, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X