బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

ఒక కంపెనీ బాగా డెవలప్ అవ్వాలంటే దాని వెనుక ఎంతమంది శ్రమ, కృషి ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఒక కంపెనీ ఈ రోజు గొప్ప స్థాయికి చేరిందంటే అది ఒక్క రోజులో జరిగిన పని కాదు. నిరంతరం జరిగిన కృషి ఫలితమే ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తాయి.

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా కీర్తి గడిస్తున్న బజాజ్ ఆటో కంపెనీ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఛైర్మన్ రాహుల్ బజాజ్ వృద్ధాప్యం కారణంగా తన పదవికి రాజీనామా చేసినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ఏప్రిల్ 29 న అధికారికంగా తెలిపింది.

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

బజాజ్ కంపెనీ యొక్క ఛైర్మన్ రాహుల్ బజాజ్ 1972 నుండి కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. అతను గత 50 సంవత్సరాలుగా బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నాడు. వయసు మళ్ళిన కారణంగా అతడు తన పదవి నుండి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

MOST READ:హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

రాహుల్ బజాజ్ గత 50 సంవత్సరాలుగా బజాజ్ గ్రూప్ యొక్క ఉన్నతికి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నీరాజ్ బజాజ్, రాహుల్ బజాజ్ రాజీనామా చేసిన తరువాత బజాజ్ ఆటోకు కొత్త చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

రాహుల్ బజాజ్ 1968 లో 30 సంవత్సరాల వయసులో 'బజాజ్ ఆటో లిమిటెడ్' కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో, అతను ఒక సంస్థ యొక్క సిఇఓ అయిన అతి చిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు.

MOST READ:కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

రాహుల్ బజాజ్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త అయిన జమ్నాలాల్ బజాజ్ మనవడు. రాహుల్ దేశ రాజధాని ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో చదివి తరువాత, ముంబైలోని లా యూనివర్శిటీ నుండి న్యాయ పట్టా కూడా పొందాడు.

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

రాహుల్ బజాజ్ కంపెనీ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బజాజ్ కంపెనీ యొక్క అభివృద్ధికి చాలా కృషి చేశారు. తన కృషి వల్లనే బజాజ్ ఈ రోజుకి ప్రముఖ ఆటో మొబైల్ పరిశ్రమలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టి ఎంతోమంది వినియోగదారులను ఆకర్షించింది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

బజాజ్ ఆటో యొక్క బజాజ్ చేతక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్కూటర్ గా ఉంది. ఈ స్కూటర్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎంతో మంది కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

బజాజ్ ఆటో ఇటీవల తన త్రైమాసిక అమ్మకాల నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, కంపెనీ యొక్క త్రైమాసికంలో 1.7% వృద్ధి పెరిగి రూ. 1,332.1 కోట్లకు చేరుకుంది. 2020 లో ఇదే త్రైమాసికంలో కంపెనీ యొక్క లాభం 1,310.3 కోట్లు.

MOST READ:మే 2021లో విడుదల కానున్న కొత్త కార్లు: అల్కజార్, సెల్టోస్, సోనెట్, గుర్ఖా, టైగన్

బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

2021 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో బాగా పెరుగుదల కనిపించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ యొక్క ఆదాయం 26.1% పెరిగి ప్రస్తుతం రూ. 8,596.1 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అక్షరాలా రూ. 6,815.9 కోట్లు.

Most Read Articles

English summary
Rahul Bajaj Resigns For The Post Of Bajaj Auto Chairman. Read in Telugu.
Story first published: Friday, April 30, 2021, 14:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X