Just In
- 24 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 34 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 43 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే
భారతదేశంలోని ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ రాపిడో ప్రస్తుతం రెంటల్ బైక్ టాక్సీ సర్వీస్ ప్రారంభించింది. గతంలో పిక్-అప్ మరియు డ్రాప్-ఆఫ్ సర్వీస్ మాత్రమే ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు రెంటల్ సర్వీస్ కూడా ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రాపిడో కంపెనీ తన సర్వీస్ ని గంట నుండి ఆరు గంటల ప్యాకేజీ ప్రాతిపదికన అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గంటకు రెంట్ రూ. 99 గా నిర్ణయించబడింది. ఇది మాత్రమే కాకుండా ఒక గంట లేదా ఒక కిలోమీటరుకు 10 రూపాయలు చొప్పున కూడా తన సర్వీస్ ని అందిస్తుంది.

రాపిడో అందిస్తున్న ఈ సర్వీస్ లో 6 గంటలు ప్యాకేజీకి 60 కి.మీ. దీనికి చెల్లించాల్సిన రెంట్ రూ. 599. రాపిడో రెంట్ బైక్ సర్వీస్ ఒకటి, రెండు, మూడు, నాలుగు మరియు ఆరు గంటల ప్రాతిపదికన లభిస్తుందని రాపిడో ఒక ప్రకటనలో ప్రకటించింది.
MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

ఈ ప్యాకేజీ సర్వీస్ లో మా భాగస్వామి ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో వారు మరొక పిక్-అప్ లేదా ఇతర మిషన్‌కు వెళ్లరని రాపిడో హామీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సర్వీస్ చాలా నగరాల్లో వినియోగంలో ఉందని రాపిడో తెలిపింది.

అయితే రాపిడో ఈ సేవను దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. ఈ సర్వీస్ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, కోల్‌కతా, జైపూర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి దశ ప్రారంభించబడినందున ఈ సర్వీస్ ప్రస్తుతం ఈ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

రాపిడో కంపెనీ ఈ సర్వీస్ ని త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. అదనంగా, రాపిడో తన భాగస్వాముల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మరియు వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించినట్లు చెప్పారు.

రాపిడో ప్రారంభించిన ఈ సర్వీస్ వాళ్ళ చాలామంది ప్రజలకు ఉపయోగకారముగా ఉంటుంది. నగరాలలో అత్యవసర సాయంలో వాహనాలు కావాలనుకునే వారికీ ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు త్వరగా విస్తరిస్తే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు