రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

భారతదేశంలోని ప్రముఖ బైక్ టాక్సీ సంస్థ రాపిడో ప్రస్తుతం రెంటల్ బైక్ టాక్సీ సర్వీస్ ప్రారంభించింది. గతంలో పిక్-అప్ మరియు డ్రాప్-ఆఫ్ సర్వీస్ మాత్రమే ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు రెంటల్ సర్వీస్ కూడా ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

రాపిడో కంపెనీ తన సర్వీస్ ని గంట నుండి ఆరు గంటల ప్యాకేజీ ప్రాతిపదికన అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గంటకు రెంట్ రూ. 99 గా నిర్ణయించబడింది. ఇది మాత్రమే కాకుండా ఒక గంట లేదా ఒక కిలోమీటరుకు 10 రూపాయలు చొప్పున కూడా తన సర్వీస్ ని అందిస్తుంది.

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

రాపిడో అందిస్తున్న ఈ సర్వీస్ లో 6 గంటలు ప్యాకేజీకి 60 కి.మీ. దీనికి చెల్లించాల్సిన రెంట్ రూ. 599. రాపిడో రెంట్ బైక్ సర్వీస్ ఒకటి, రెండు, మూడు, నాలుగు మరియు ఆరు గంటల ప్రాతిపదికన లభిస్తుందని రాపిడో ఒక ప్రకటనలో ప్రకటించింది.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

ఈ ప్యాకేజీ సర్వీస్ లో మా భాగస్వామి ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటారు. ఈ మధ్య కాలంలో వారు మరొక పిక్-అప్ లేదా ఇతర మిషన్‌కు వెళ్లరని రాపిడో హామీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సర్వీస్ చాలా నగరాల్లో వినియోగంలో ఉందని రాపిడో తెలిపింది.

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

అయితే రాపిడో ఈ సేవను దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. ఈ సర్వీస్ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, కోల్‌కతా, జైపూర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి దశ ప్రారంభించబడినందున ఈ సర్వీస్ ప్రస్తుతం ఈ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

రాపిడో కంపెనీ ఈ సర్వీస్ ని త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. అదనంగా, రాపిడో తన భాగస్వాముల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మరియు వినియోగదారులకు అనుకూలంగా ఉండటమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించినట్లు చెప్పారు.

రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

రాపిడో ప్రారంభించిన ఈ సర్వీస్ వాళ్ళ చాలామంది ప్రజలకు ఉపయోగకారముగా ఉంటుంది. నగరాలలో అత్యవసర సాయంలో వాహనాలు కావాలనుకునే వారికీ ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు త్వరగా విస్తరిస్తే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

Most Read Articles

English summary
Rapido Rental Services Launched. Read in Telugu.
Story first published: Wednesday, February 10, 2021, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X