రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా కీర్తి గడించింది. అయితే భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఈ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా తన పరిధికి విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే దేశం మొత్తంలో తన కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తున్నాయి.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఇటీవల కాలంలో బెంగళూరు, జైపూర్, సూరత్, వైజాగ్, కలకత్తా మరియు తమిళనాడులోని మధురై వంటి నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు తన కొత్త స్టోర్‌ను తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రారంభించింది. ఈ నెలలోనే కంపెనీ తమిళనాడులో ప్రారంభించిన రెండవ డీలర్‌షిప్‌.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంలో కంపెనీ నిమగ్నమై ఉంది. గత నెలలో, రివోల్ట్ మోటార్స్ దేశంలోని 70 నగరాల్లో బుకింగ్ ప్రారంభించింది. కావున ఈ పరిస్థితిలో ఈ 70 నగరాల్లో కూడా కంపెనీ తన డీలర్‌షిప్‌లను ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

కంపెనీ ఇప్పటివరకు 16 నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇది 2022 నాటికి 59 నగరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రివోల్ట్ మోటార్స్ 2021 అక్టోబర్ నెలలో 3 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది, ఆ తర్వాత నవంబర్ నెలలో కంపెనీ 5 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

కంపెనీ ఈ 2021 డిసెంబర్ నెలలో మరిన్ని డీలర్‌షిప్‌లను ప్రారభించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కంపెనీ కొత్త ప్రాంతాలలో దూసుకుపోతోంది, అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత కావాల్సిన సర్వీస్ మరియు విడిభాగాలు కొత్త డీలర్‌షిప్‌లో విక్రయించబడాతాయి.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. తమ ఎలక్ట్రిక్ బైక్‌లు కేవలం 9 రూపాయలలో 100 కి.మీల దూరాన్ని చేరుకోగలవని కంపెనీ పేర్కొంది. గత నెల కంపెనీ అక్టోబర్ 21 న 70 నగరాలకు బుకింగ్ ప్రారంభించింది.

ఈ కొత్త బ్యాచ్ యొక్క డెలివరీని డిసెంబర్-జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని కోసం కంపెనీ అనేక నగరాల డెలివరీ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఏప్రిల్‌లో కంపెనీ తన నెట్‌వర్క్‌ను 35 నగరాలకు విస్తరించనున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించింది, ఏప్రిల్ నాటికి కంపెనీ కేవలం 6 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

Revolt Electric Motorcycles ఇటీవల రతన్ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మరియు కొత్త పెట్టుబడిలో భాగంగా, కంపెనీ అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వచ్చింది మరియు కొత్త నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. రివోల్ట్‌లో 50% వాటా కంపెనీకి చేరింది. మొత్తానికి రానున్న రోజుల్లో తన ఉనికిని విస్తరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మార్చవచ్చు. రివోల్ట్ RV 400 బైక్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేయగల ఒక స్వాప్ బ్యాటరీని కూడా పొందుతుంది. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

రోజురోజుకి పెరుగుతున్న Revolt Motors డీలర్‌షిప్‌లు.. ఇప్పుడు కోయంబత్తూరులో కూడా..!!

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, మార్కెట్లో ముడి పదార్థాల ధరలో ఆకస్మిక మరియు గణనీయమైన పెరుగుదల కారణంగా Revolt RV400 ధర కూడా పెరిగింది అని తెలుస్తుంది. అంతే కాకుండా, బుకింగ్ సమయంలో ప్రస్తుత ధరకు బైక్‌ను డెలివరీ చేయలేమని కంపెనీ తెలిపింది.

అయితే ఈ ప్రకటనకు ముందు మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకునేటప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది కొనుగోలుదారులపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో ముందు ముందు తెలుస్తుంది. Revolt RV400 ధరల పెంపుతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్యాటరీ వారెంటీకి సంబంధించి బ్రాండ్ మరో ప్రకటన చేసింది. ఇంతకుముందు RV400 యొక్క 3.24 kWh బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ కవరేజీని అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ తన బ్యాటరీపై కేవలం 6 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ కవరేజీని మాత్రమే అందిస్తుంది.

Most Read Articles

English summary
Revolt motors opens new dealership in coimbatore details
Story first published: Friday, December 10, 2021, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X