కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌: వివరాలు

గత కొంత కాలంగా భారతీయ మార్కెట్లో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బెంగళూరు, జైపూర్, సూరత్ మరియు వైజాగ్ వంటి నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కలకత్తాలో డీలర్‌షిప్‌ను ప్రారంభించనుంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుండి రివోల్ట్ మోటార్స్ మంచి స్పందనను పొందుతూనే ఉంది. ఈ పరిస్థితిలో కంపెనీ నిరంతరం తన నెట్‌వర్క్‌ను విస్తరించడంలో నిమగ్నమై ఉంది. అంతే కాకుండా ఇప్పటికే రివోల్ట్ మోటార్స్ యొక్క డీలర్‌షిప్‌లు కోయంబత్తూర్, వైజాగ్, మదురై మరియు విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా ఉన్నాయి.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

రివోల్ట్ మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ బైక్‌లైన RV400 మరియు RV300 లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ పరిస్థితిలో, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కంపెనీ తన పరిధిని చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ కొత్త ప్రాంతాలలో కూడా శర వేగంగా దూసుకుపోతోంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

కంపెనీ కేవలం అమ్మకాలను మాత్రమే కాకుండా అమ్మకాల తర్వాత కావాల్సిన సర్వీస్ మరియు విడిభాగాలు వంటి వాటిని కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధర కారణంగా, ప్రజలు ఇప్పుడు పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చాలా వేగంగా ఉంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

కంపెనీ యొక్క బైకులకు మంచి ఆదరణ ఉంది, కానీ కంపెనీ యొక్క బైకుల డెలివరీ విషయంలో మాత్రం కొంత జాప్యం జరుగుతుంది అని కొంతమంది పిర్యాదు చేస్తున్నారు. రివోల్ట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైక్‌లు అతి తక్కువ ధరతో ఎక్కువ దూరాన్ని అందిస్తాయని కంపెనీ ఇదివరకే తెలిపింది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

కంపెనీ యొక్క కొత్త బ్యాచ్ డెలివరీని డిసెంబర్ లేదా జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని కోసం కంపెనీ అనేక నగరాల డెలివరీ టైమ్‌లైన్ గురించి సమాచారాన్ని కూడా అందించింది. ఏప్రిల్‌లో కంపెనీ తన నెట్‌వర్క్‌ను 35 నగరాలకు విస్తరించనున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఏప్రిల్ నాటికి కంపెనీ కేవలం 6 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

రివోల్ట్ కంపెనీ యొక్క RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3 కిలోవాట్ మోటార్‌తో వస్తుంది. అంతే కాకూండా ఇది 72 V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ వరకు ఉంటుంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది.

ఇందులో బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt యాప్ ద్వారా బైక్ ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇది కాకుండా, బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మార్చవచ్చు. రివోల్ట్ RV 400 బైక్ నుండి బయటకు తీసి ఛార్జ్ చేయగల ఒక స్వాప్ బ్యాటరీని కూడా పొందుతుంది. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతుంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన బైక్‌ల ధరలను అమాంతం పెంచినట్లు తెలిపింది. ఈ కారణంగా Revolt RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర మునుపటికంటే రూ. 18,000 పెరిగింది. అయితే పెరిగిన ఈ ధరలు FAME 2 సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ముంబై మినహా దేశవ్యాప్తంగా Revolt RV 400 ధర ఎక్స్-షోరూమ్ మరియు రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి రూ. 1.25 లక్షలు వరకు ఉంటుంది. కానీ ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈ బైక్ ధర రూ. 1.26 లక్షలు అందుబాటులో ఉంటుంది.

కలకత్తాలో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్‌

కంపెనీ అందించిన తాజా సమాచారం ప్రకారం, మార్కెట్లో ముడి పదార్థాల ధరలో ఆకస్మిక మరియు గణనీయమైన పెరుగుదల కారణంగా Revolt RV400 ధర కూడా పెరిగింది అని తెలుస్తుంది. అంతే కాకుండా, బుకింగ్ సమయంలో ప్రస్తుత ధరకు బైక్‌ను డెలివరీ చేయలేమని కంపెనీ తెలిపింది.

అయితే ఈ ప్రకటనకు ముందు మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకునేటప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది కొనుగోలుదారులపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో ముందు ముందు తెలుస్తుంది. Revolt RV400 ధరల పెంపుతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్యాటరీ వారెంటీకి సంబంధించి బ్రాండ్ మరో ప్రకటన చేసింది. ఇంతకుముందు RV400 యొక్క 3.24 kWh బ్యాటరీ ప్యాక్ 8 సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ కవరేజీని అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ తన బ్యాటరీపై కేవలం 6 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారెంటీ కవరేజీని మాత్రమే అందిస్తుంది.

Most Read Articles

English summary
Revolt motors to open new dealership in kolkata details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X