సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి Revolt Motors (రివాల్ట్ మోటార్స్‌). కంపెనీ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది, ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో మరియు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో తన డీలర్‌షిప్లను ప్రారంభించింది. అయితే రేపు Revolt కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో కూడా ఒక కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ వచ్చింది, కావున కంపెనీ అనేక కొత్త నగరాలకు తన ఉనికిని విస్తరించబోతోంది. రివాల్ట్ మోటార్స్ ఇప్పటికే సూరత్‌తో సహా అనేక నగరాల్లో డెలివరీలను ప్రారంభించింది. కానీ కంపెనీ ఇప్పుడు దాని డీలర్‌షిప్‌ను సూరత్‌లో ఏర్పాటు చేస్తుంది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

ఈ కొత్త డీలర్‌షిప్‌లో కస్టమర్‌లు తమ వాహనానాలకు సర్వీస్ వాటి సేవలను పొందవచ్చు. అంతే కాకుండా కంపెనీ యొక్క వాహనాలను కొనుగోలు చెలనుకునే కొత్త కస్టమర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. దీనితో పాటు టెస్ట్ రైడ్ వంటి వాటిని కూడా ఈ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

కంపెనీ కొత్త బుకింగ్‌ల ప్రారంభంతో, RV400 బైక్ ని కొత్త కలర్ ఆప్సన్ అయిన మిస్ట్ గ్రేలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త బ్యాచ్ డెలివరీలను డిసెంబర్-జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే అనేక నగరాల డెలివరీ టైమ్‌లైన్ గురించి కూడా సమాచారం అందించింది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

కంపెనీ ప్రస్తుతం తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కావున త్వరలో బైక్ డెలివరీలు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్‌ను కాస్మిక్ బ్లాక్, రెబెల్ రెడ్ మరియు మిస్ట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచింది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కారణంగా, RV400 ఎలక్ట్రిక్ బైక్‌తో సహా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గాయి, అయితే ఈ సమయంలో దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కావున ఎక్కువమంది వాహన కొనుగోలుదారుల దృష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపైన పడింది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

భారతదేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న FAME-2 స్కీమ్ కింద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కారణంగా, Revolt బైక్ ధర రూ.28,000 వరకు తగ్గుతుంది. అయితే ఈ తగ్గుదల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధరకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం Revolt RV400 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,799 కి చేరింది. గతంలో ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,18,999.

అదే సమయంలో, గుజరాత్ ప్రభుత్వం యొక్క కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం, ఈ బైక్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో రూ. 87,000 కు విక్రయించబడుతోంది. మహారాష్ట్రలో ఈ బైక్‌లపై సుమారు రూ.25,000 సబ్సిడీ ఇస్తుండగా, గుజరాత్‌లో ఈ సంఖ్య రూ. 20,000 గా ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు సుమారు రూ. 16,000 తగ్గనుండగా, మేఘాలయలో రూ. 32,000 వరకు తగ్గుతున్నాయి. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీల వల్ల ధరలు చాలా వరకు తగ్గుతాయి.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

Revolt RV400 బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 156 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో 5kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించింది. అంతే కాకుండా ఈ బైక్ 3.24kWh యొక్క స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్లు. బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది. ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో అత్యధికంగా ఈ బైక్‌పై కంపెనీ 1.5 లక్షల కి.మీ వారంటీ ఇస్తోంది.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

రివాల్ట్ యొక్క ఈ రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇవి అత్యంత ఆధునిక బైకులుగా మారాయి. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ లు మరియు ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. Revolt RV400 మరియు RV300 లలో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ బటన్‌లు మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కీలెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సూరత్‌లో ప్రారంభం కానున్న Revolt Motors డీలర్‌షిప్: పూర్తి వివరాలు

ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ పొజిషనింగ్ మరియు బ్యాటరీ హెల్త్ ఫీచర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగించవచ్చు.

Revolt Motors తన ఉనికిని విస్తరించడంతో భాగంగానే దేశంలోని అనేక కొత్త నగరాల్లో డీలర్‌షిప్లను ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో కంపెనీకి చాలా నగరాల నుండి గొప్ప స్పందనను పొందుతోంది. ఈ పరిస్థితిలో కస్టమర్‌లకు మెరుగైన సేవలను అందించడానికి కంపెనీ ఈ నగరాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 28, 2021, 13:59 [IST]
English summary
Revolt motors to open showroom in surat details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+