మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

సైడ్ మిర్రర్స్ లేకుండా టూవీలర్లను రైడ్ చేస్తున్నారా? అయితే, మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు సైడ్ మిర్రర్స్ లేని టూవీలర్స్‌పై ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సైడ్ మిర్రర్ లేకుండా కనిపించిన టూవీలర్ల యజమానులకు జరిమానాలు విధిస్తున్నారు.

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఇదే తరహా విధానాన్ని అనుసరించారు. తాజాగా, మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా టూవీలర్లపై రియర్‌వ్యూ లేని రైడర్‌కు జరిమానా విధించడం ప్రారంభించారు. టూవీలర్లపై సైడ్ మిర్రర్స్ ఉండంటం ఓ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా పరిగణిస్తారు.

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

అంతేకాకుండా, సెంట్రల్ మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 5 మరియు సెక్షన్ 7 ప్రకారం, ద్విచక్ర వాహనాలన్నింటికీ తప్పనిసరిగా రెండు రియర్ వ్యూ మిర్రర్లు (సైడ్ మిర్రర్లు) ఉండాలి. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ఇకపై ఈ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు.

MOST READ:బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

చాలా మంది యువత తమ టూవీలర్లను కొనుగోలు చేసిన వెంటనే సైడ్ మిర్రర్లను తొలగించి వేస్తుంటారు. ఇలా ఎందుకు చేశారని వారిని ప్రశ్నిస్తే, సైడ్ మిర్రర్స్ అడ్డుగా ఉంటాయని, బైక్ అందాన్ని తగ్గిస్తాయని ఇలా రకరకాల సమాధానాలు చెబుతుంటారు. ఇకపై అలా కుదరదు.

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

ఇక నుండి హైదరాబాద్ రోడ్లపై తిరిగే అన్ని మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లు తప్పనిసరిగా సైడ్ మిర్రర్లను కలిగి ఉండాల్సిందే. గతంలో ఎన్నడూ లేనిది, ఒక్కసారిగా ఈ నిబంధను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులు చూస్తుండటంతో, దీనిపై ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

ఈ నిర్ణయం వలన రోడ్ సేఫ్టీ పెరుగుతుందని కొందరు చెబుతుంటే, ఇది టూవీలర్ రైడర్లపై అనవసరమైన భారాన్ని మోపుతుందని మరి కొందరు అంటున్నారు. పోలీసులు మాత్రం ఇది మోటారిస్టుల భద్రను ఉద్దేశించి అమలు చేస్తున్న విధానమేనని చెబుతున్నారు.

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

పోలీసుల ప్రకారం, మోటారు వాహనాల చట్టం యొక్క నియమ నిబంధనలు అనేవి వాహనదారుల భద్రత కోసం మాత్రమే రూపొందించబడినవి. ట్రాఫిక్ క్రమశిక్షణను నిర్ధారించడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నియమాలు ఉపయోగపడుతాయి.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

టూవీలర్లపై రియర్‌వ్యూ మిర్రర్స్ లేకుండా స్వారీ చేయడం ట్రాఫిక్ ఉల్లంఘన అని చాలా మంది రైడర్లకు తెలియదు. వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించడంలో రియర్ వ్యూ మిర్రర్లు ఎంతో ఉపయోగపడుతాయి మరియు ప్రమాదాల నుండి తప్పించుకోవడంలో సహాయపడతాయి.

మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

లేన్ మారేటప్పుడు, వెనుక వైపు వస్తున్న వాహనాలను గుర్తించేందుకు, ఓవర్‌టేక్ చేసటప్పుడు రియర్ వ్యూ మిర్రర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మీ టూవీలర్లకు తప్పనిసరిగా ఈ మిర్రర్లు ఉండేలా చూసుకోండి. పోలీసులు విధించే జరిమానాలు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ఇవి మిమ్మల్ని కాపాడుతాయి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

Most Read Articles

English summary
Riding Two Wheelers Without Rear View Mirrors In Hyderabad Is A Traffic Violation. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X