మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; రిస్ట్రెట్టో 303ఎఫ్ఎస్ ఫౌండర్, వివరాలు

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్ వల్ల దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల డెన్వర్ ఆధారిత సంస్థ కొత్త రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఫౌండర్ ఎడిషన్ ఇ-బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఈ బైక్ యొక్క బుకింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

ఈ కొత్త రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఫౌండర్ ఎడిషన్ ఈ-బైక్ 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త ఈ బైక్‌ను రిస్ట్రెట్టో కేవలం 500 యూనిట్లను మాత్రమే విడుదల చేయనుంది. సాధారణంగా చాలా ఈ-బైక్‌లలో హబ్ మోటార్లు ఉపయోగిస్తుండగా, రిస్ట్రెట్టో 303 మిడ్-మౌంటెడ్ 3.5 కిలోవాట్ల మోటారును ఏర్పాటు చేశారు.

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

ఈ-బైక్‌ ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్ అని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఈ-బైక్ గంటకు 64 కిమీ వరకు వేగవంత అవుతుంది. ఈ-బైక్‌లలో దాదాపు ఇదే అత్యంత వేగవంతమైన బైక్. కానీ సాధారణ రోడ్లపై వేగవంతం చేయడం చట్టవిరుద్ధం. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ సాధారణ రోడ్లపై నడపడానికి రోడ్ మోడ్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఈ-బైక్‌ను డెన్వర్ రోడ్లపై నడపవచ్చు.

MOST READ:భారత్‌లో వాడుకలో ఉన్న అంబులెన్స్ రకాల గురించి మీకు తెలుసా?

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

కొత్త రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఈ-బైక్ మోటారు 88 కిలోమీటర్ల పరిధిని అందించే 17.5 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడింది. ఇది 450ఎక్స్ కంటే మరియు హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కంటే కూడా రెండు రేట్లు ఎక్కువగా ఉంటుంది. రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఇ-బైక్ ఛార్జింగ్ చేయడానికి సుమారు 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఈ కొత్త బైక్ కి ఇంతకంటే వేగంగా ఛార్జ్ చేయడానికి అవకాశం లేదు.

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

ఈ కొత్త ఈ బైక్ మంచి బ్రేకింగ్ సిస్టమ్ మరియు సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్ యొక్క ముందు భాగంలో బీఫీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో స్పెషల్ డ్యూయల్ షాక్ సెటప్ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది మంచి బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందుభాగంలో 203 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 203 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడుతుంది.

MOST READ:ఎమర్జెన్సీ వాహనాల్లో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఫౌండర్ ఎడిషన్ ఇ-బైక్‌లో డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న ఎల్‌సిడి కన్సోల్ అవసరమైన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. బ్రాండ్ యొక్క యాప్ ని జత చేయడానికి బ్లూటూత్ కనెక్టివిటీని పొందడమే కాకుండా, వినియోగదారులు తమ ఇ-బైక్‌లపై జిపిఎస్ / యాంటీ-తెఫ్ట్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు.

త్వరలో రానున్న మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; వివరాలు

ఈ కొత్త ఈ బైక్ చాలా అద్భుతంగా ఉండి, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానుంది, కానీ కానీ రిస్ట్రెట్టో 303 ఎఫ్ఎస్ ఈ-బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఈ బైక్ ధర దాదాపు 2 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

MOST READ:360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

Most Read Articles

English summary
Most Powerful E-Bike The Ristretto 303 FS Founders Edition Launched. Read in Telugu.
Story first published: Friday, May 28, 2021, 11:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X