2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

దేశీయ మార్కెట్లో ప్రముఖ బైక్ తయారీదారుగా ప్రఖ్యాతిగాంచిన కంపెనీలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల 2021 ఏప్రిల్‌ నెలలో జరిగిన అమ్మకాల నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గత నెలలో కంపెనీ 53,298 యూనిట్ బైక్‌లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

కంపెనీ యొక్క నివేదికల ప్రకారం ఇందులో 48,789 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. మిగిలిన 4,509 యూనిట్లు దేశీయ మార్కెట్ నుంచి ఎగుమతి చేసినట్లు తెలిపింది. కంపెనీ గత ఏడాది ఇదే నెలలో కరోనా లాక్ డౌన్ సమయంలో కంపెనీ కేవలం 91 బైక్‌లను మాత్రమే విక్రయించింది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

కరోనా లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ కారణంగా మార్చిలో పోలిస్తే ఏప్రిల్‌ చివరి 15 రోజుల్లో అమ్మకాలు దాదాపు 19 శాతం తగ్గాయని తెలిసింది. 2021 మార్చిలో కంపెనీ 66,058 యూనిట్ బైక్‌లను విక్రయించింది. గత నెలలో కంపెనీ తన 350 సిసి మీటియార్ బైక్ యుఎస్‌ మార్కెట్లో లాంచ్ చేయడం ద్వారా కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి కొత్త మరియు అప్డేటెడ్ మోడల్స్ విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో కొత్త క్లాసిక్ 350, హంటర్ 350 మరియు కొత్త 650 సిసి బైక్ ఉన్నాయి.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టిప్పర్ నావిగేషన్‌ వంటి వాటితో రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ మన భారతదేశం. ఒక్క ఇండియా మాత్రమే కాకుండా యూరప్, అమెరికా మరియు ఆగ్నేయాసియాలోని అనేక దేశాలలో కంపెనీ తన బైక్‌లను విక్రయిస్తుంది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

దీన్ని బట్టి చూస్తే కంపెనీకి దేశ విదేశాల్లో ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 ఏప్రిల్ తన బుల్లెట్ 350, క్లాసిక్ 350 మరియు మీటియార్ 350 యొక్క అన్ని వేరియంట్ల ధరలను పెంచుతూ ప్రకటించింది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత సరసమైన బైక్ అయిన బుల్లెట్ 350 ధర ఇప్పుడు మునుపటికంటే 10,000 రూపాయలు ఎక్కువగా ఉంది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధరను రూ. 4,490 పెంచారు. ధరల పెరుగుదల తరువాత ఇప్పుడు బుల్లెట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 1,54,327 రూపాయలకు లభిస్తుంది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ అయిన క్లాసిక్ 350 విషయానికి వస్తే, ఈ బైక్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 5,992 వరకు ఖరీదైనది. ఇప్పుడు క్లాసిక్ 350 యొక్క బేస్ మోడల్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర 1,72,465 రూపాయలకు లభిస్తుంది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

ఇదే సమయంలో, గత సంవత్సరం కంపెనీ లాంచ్ చేసిన మీటియార్ 350 ధర రూ. 6,023 వరకు పెంచారు. ధరల పెరుగుదల తర్వాత మీటియార్ 350 యొక్క బేస్ మోడల్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ప్రకారం 1,84,319 రూపాయలకు లభిస్తుంది.

2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు హవా

దీన్ని బట్టి చూస్తే కంపెనీ ధరల పెరుగుదల ఇప్పుడు ఏకంగా మూడవసారి. ఇంతకుముందు కంపెనీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా మోడళ్ల ధరలను పెంచింది. ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమలో బైక్ తయారీలో ఉపయోగించే ముడి పరికరాల ధరల పెరుగుదల కారణంగా ధరను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Royal Enfield Sales April 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X