బ్రేకింగ్ న్యూస్.. Royal Enfield Classic 350 కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. అదేంటో ఇప్పుడే చూడండి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క క్లాసిక్ 350 బైక్ అత్యధిక అమ్మకాలను పొందుతున్న బైక్. ఈ కారణంగానే కంపెనీ ఇటీవల కాలంలో కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 విడుదల చేసింది. ఇది ఇప్పటికి కూడా మంచి అమ్మకాలతోముందుకు సాగుతుంది. బ్రేక్ లోపం కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ యొక్క 26,300 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

నివేదికల ప్రకారం కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ లోబ్రేక్ లోపం కారణంగా ఏకంగా 26,300 యూనిట్లను రీకాల్ చేస్తోంది, కంపెనీ ముందుజాగ్రత్తగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 2021 సెప్టెంబర్ 01 నుంచి 2021 డిసెంబర్ 05 మధ్య తయారు చేయబడిన బైకులకు రీకాల్ చేయనున్నారు.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రోజు అధికారికంగా SIAM కి తెలిపింది. అంతే కాకూండా రీకాల్ గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ రోడ్లు మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేసింది. సింగిల్ ఛానల్ ABS మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌లో ఉపయోగించే బైక్ యొక్క స్వింగ్ ఆర్మ్‌లోని రియాక్షన్ బ్రాకెట్‌లో ఒక భాగంలో లోపాన్ని తమ సాంకేతిక బృందం గుర్తించిన కారణంగా ప్రస్తుతం ఈ రీకాల్ ప్రకటించింది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

బైకులో ఏర్పడిన ఈ బైక్ వల్ల భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కంపెనీ దీనిని ప్రకటించింది. రైడింగ్ పరిస్థితులలో వెనుక బ్రేక్ పెడల్‌పై అధిక బ్రేక్ లోడ్ రియాక్షన్ బ్రాకెట్ వైఫల్యానికి దారి తీస్తుంది. ఆ సమయంలో ఇది బ్రేకింగ్ యొక్క శబ్దాన్ని ఎక్కువ చేస్తుంది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

ఆ పరిస్థితుల్లో ఈ బైక్ యొక్క బ్రేకింగ్ నాణ్యత తగ్గుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ టీమ్ మరియు స్థానిక డీలర్‌షిప్ ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది. అంతే కాకుండా ఈ సమస్య ఉన్న కస్టమర్‌లు తమ సమీప రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. అలా కాకుండా 1800 210 007 కు కాల్ చేయడం ద్వారా మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు. కంపెనీ తెలిపిన ఆ సమయంలో కొనుగోలు చేసిన కస్టమర్లు తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడే భవిష్యత్ లో జరిగే ప్రమాదాలు కూడా ఆరికట్టవచ్చు.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

ఇదిలా ఉండగా రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క క్లాసిక్ 350 బైక్ దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఏకంగా ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తిని దాటింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350(Royal Enfield Classic 350) యొక్క కొత్త మోడల్ 2021 సెప్టెంబర్ నెలలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ అతితక్కువ సమయంలోనే కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం. ప్రస్తుతం దేశంలో కంపెనీ చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇది ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2021 Royal Enfield Classic 350) బైక్ రూ. 1.84 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది. 2021 Royal Enfield Classic 350 బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో 5 వేరియంట్లలో తీసుకురాబడింది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్‌ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్‌ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్‌ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

కొత్త Classic 350 బైక్‌ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

26,300 యూనిట్ల Classic 350 కి రీకాల్ ప్రకటించిన Royal Enfield: ఎందుకంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి చెందిన Classic 350 బైక్ ఫదేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరన పొందుతోంది. అయితే ఇంతటి ఆదరణ పొందుతున్న ఈ బైక్ లో ఏదైనా సమస్య తలెత్తితే అది కంపెనీ యొక్క ప్రతిష్ఠకే ప్రమాదం వాటిల్లుతుంది. కావున కంపెనీ తన మీద కస్టమర్లు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు కూడా కంపెనీ ముందుగానే ఈ రీకాల్ సమస్యను త్వరలో పరిస్కరిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 20, 2021, 14:46 [IST]
English summary
Royal enfield claasic 350 recall over brake issue details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+