ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

ఇండియన్ హ్యార్లీ డేవిడ్సన్ బ్రాండ్‌గా చెప్పుకునే భారతీయ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఈ బ్రాండ్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లు భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను స్టేటస్ సింబల్‌గా కూడా పరిగణించేవారు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో క్లాసిక్ 350 బైక్ కూడా ఒకటి. చాలా మంది కస్టమర్లకు ఈ బైక్‌ను తమకు నచ్చినట్లుగా మోడిఫై చేసుకోవాలనుకుంటుంటారు. వాస్తవానికి, ఈ కస్టమైజేషన్ కోసం కంపెనీ కొన్ని అధికారిక యాక్ససరీలను అందింస్తున్నప్పటికీ, అవి కొంత వరకూ మాత్రమే ఔత్సాహికులను సంతృప్తిపరచగలవు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

అందుకే, కొందరు ఈ కస్టమైజేషన్ కోసం థర్డ్ పార్టీ బైక్ మోడిఫికేషన్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. తాజాగా మోటార్‌హెడ్స్ కస్టమ్ అనే బైక్ మోడిఫికేషన్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను బాబర్ స్టైల్‌లో కస్టమైజ్ చేసింది. ఈ కస్టమ్ మోటార్‌సైకిల్‌కు విసెరియన్ 350 పేరును కూడా పెట్టారు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను మొదటిసారిగా 2009 లో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఈ బైక్ దాదాపు ఒకేరకమైన డిజైన్ స్టైల్‌ని కలిగి ఉంటుంది. దీని సాధారణ కాన్ఫిగరేషన్ కారణంగా, ఈ బైక్‌ను మోడిఫై చేయటానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకే ఔత్సాహికులు ఈ బైక్‌ను ఎంచుకుంటుంటారు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

ఈ ఫొటోల్లో చూస్తున్న బాబర్ స్టైల్ క్లాసిక్ 350 బైక్‌ని మోటార్‌హెడ్స్ కస్టమ్ సంస్థ టాప్ టూ బాటమ్ వరకూ పూర్తిగా కస్టమైజ్ చేసింది. ఇందులో ఇంజన్ మరియు కొన్ని మెకానికల్స్ మినహా మిగిలిన అన్ని భాగాలను కంపెనీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

ఈ కస్టమైజ్డ్ విసెరియన్ 350 బైక్ ముందు భాగంలో స్టాక్ హెడ్‌లైట్ మరియు ఇండికేటర్లను తొలగించి ఓ సరికొత్త ఎల్ఈడి హెడ్‌లైట్‌ను ఉపయోగించారు మరియు దాని పక్కనే సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉంచారు. హ్యాండిల్ బార్ చివర్లలో ఎల్ఈడి ఇండికేటర్లను అమర్చారు మరియు తలకిందులుగా ఉండే సైడ్ మిర్రర్లను కూడా ఉపయోగించారు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

అలాగే, పొడవుగా ఉండే ఫ్రంట్ సస్పెన్షన్ మరియు టైరును అంటిపెట్టుకుని ఉన్నట్లుగా ఉండే ఫ్రంట్ ఫెండర్‌ను కూడా ఇందులో గమనించవచ్చు. దీని ఫ్యూయెల్ ట్యాంక్‌ను కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. ఈ మోటార్‌సైకిల్‌కు ఫెయిరింగ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, సైడ్ డిజైన్‌లో పెద్ద మార్పులు లేవు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

కానీ, ఇందులో కొత్త మల్టీ స్పోక్ మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్‌ని ఉపయోగించారు. వాటిని పెద్ద టైర్లను అమర్చారు. వీటిలో ముందు చక్రం, టైరుతో పోలిస్తే, వెనుక చక్రం చిన్నదిగానూ మరియు టైర్ పెద్దదిగానూ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెళ్లపై ఆర్మీ గ్రే కలర్ బాడీ గ్రాఫిక్స్‌ని ఉపయోగించారు.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

ఈ బైక్ ఇంజన్ మరియు వెనుక సస్పెన్షన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఇంజన్ క్రోమ్ ఫినిషింగ్‌లో మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే, సైడ్ బ్యాటరీ కవర్‌పై 'విసెయర్ 350' లోగోను ముద్రించారు. ఈ మోడిఫైడ్ క్లాసిక్ 350 బైక్‌లో బాబర్ మోటార్‌సైకిళ్లలో కనిపించేటట్లుగా సింగిల్ సీట్ ఉంటుంది. ఈ సీటుపై డైమండ్ డిజైన్ కుట్టు ఉంటుంది.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ అంటే నమ్ముతారా..?

వెనుక సస్పెన్షన్ సెటప్ పైభాగంలోనే రియర్ టర్న్ ఇండికేటర్లను ఉపయోగించారు. ఇకపోతే, నెంబర్ ప్లేట్‌ను నిటారుగా ఉండేలా వెనుక సస్పెన్షన్‌పై అమర్చారు మరియు దాని పైభాగంలో గుండ్రటి బ్రేక్ లైట్‌ను ఉంచారు. ఇందులో సైలెన్సర్‌ను కూడా మోడిఫై చేశారు. ఇది స్టాక్ వెర్షన్ కంటే చాలా పొట్టిగా ఉంటుంది.

Image Courtesy: Motorheads Customs

Most Read Articles

English summary
Motorheads Customs Modified Royal Enfield Classic 350 Into A Bobber Style Motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X