రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

భారత టూవీలర్ మార్కెట్లోని 350సిసి విభాగంలో ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా ఎలాంటి మోడళ్లు అందుబాటులో ఉండేవి కావు. కానీ, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కి పోటీగా అనేక ఇతర కంపెనీ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ విభాగంలో పోటీ అధికమైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 నిజంగా ఓ ఐకానిక్ మోడల్, ఇందులో సందేహమే లేదు. దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి లభిస్తున్న క్లాసిక్ 350 బైక్ భారతదేశంలోని 350సిసి టూవీలర్ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్. గత నెలలో కంపెనీ ఈ ఒక్క మోడల్‌నే 37,000 యూనిట్లకు పైగా విక్రయించింది. అది ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కి పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా, కాస్తంత విభిన్నమైన డిజైన్ కోరుకునే వారి కోసం ఇప్పుడు మార్కెట్లో అనేక టూవీలర్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరి అవేంటో, వాటి వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

1. హోండా హైనెస్ సిబి350

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కి పోటీగా జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త హైనెస్ సిబి350 బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే, హోండా హైనెస్ సిబి350, క్లాసిక్ 350 బైక్ కన్నా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది. డిజైన్ పరంగా కూడా ఇది చాలా స్టైలిష్‌గా మరియు ప్రీమయింగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో నావిగేషన్ ఫీచర్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

రైడర్లు స్మార్ట్ ఫోన్ యాప్ సాయంతో ఈ బైక్‌ను తన ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లోని 348 సిసి ఇంజన్ గరిష్టంగా 21.07 బిహెచ్‌పి శక్తిని మరియు 30 ఎన్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ క్లాసిక్ 350 ఇంజన్ కన్నా సున్నితంగా ఉంటుంది మరియు తక్కువ వైబ్రేషన్‌ను కలిగి ఉంటుంది. ఇస్తుంది. ఇంకా ఇందులో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది. మార్కెట్లో దీని ధరలు రూ.1.86 లక్షల నుండి రూ.1.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

2. బెనెల్లి ఇంపీరియల్ 400

బెనెల్లి ఇంపీరియల్ 400 మోటార్‌సైకిల్ కూడా రెట్రో-క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉండి, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇందులో 374సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 21 బిహెచ్‌పి శక్తిని మరియు 29 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర, ఫీచర్లు మరియు పనితీరు పరంగా ఇది క్లాసిక్ 350 బైక్‌తో పోటీపడుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

ఈ బైక్‌లో ఇంధన సూచిక మరియు గేర్ స్థానం సూచికను చూపించే ట్విన్ పాడ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ బైక్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ఏబిఎస్ మరియు స్పోక్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. మార్కెట్లో బెనెల్లి ఇంపీరియల్ 400 ధరలు రూ.1.89 లక్షల నుంచి రూ.1.93 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

3. జావా క్లాసిక్

ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'జావా'ను మహీంద్రా సంస్థ తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. జావా అందిస్తున్న మోటార్‌సైకిళ్లు ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీగా ఉంటున్నాయి. ఇవి శక్తివంతమైన ఇంజన్ మరియు అద్భుతమైన ఫీచర్లతో లభిస్తాయి. ఈ బైక్‌లలో 293సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది ఇతర బైక్‌ల కంటే మెరుగైన పనితీరును అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఏబిఎస్, సర్దుబాటు చేయగల వెనుక సస్పెన్షన్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. జావా బైక్స్ డబుల్ మరియు సింగిల్ డిస్క్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో జావా క్లాసిక్ ధరలు రూ.1.77 లక్షల నుండి రూ.1.86 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

4. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350

భారత టూవీలర్ మార్కెట్లోని 350సిసి విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త ప్రత్యామ్నాయంగా మీటియోర్ 350 బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్ క్లాసిక్ 350 కంటే మోడ్రన్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో పరిచయం చేయబడింది. మీటియోర్ 350 ఒక సౌకర్యవంతమైన రైడ్‌ను అందించే రెట్రో క్రూయిజర్ బైక్‌గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బైక్ లీటరుకు 41 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ బైక్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, నావిగేషన్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ ప్రారంభ ధర రూ.1.78 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

5. బజాజ్ డొమినార్ 400

బజాజ్ ఆటో అందిస్తున్న డొమినార్ 400 రెట్రో-మోడ్రన్ బైక్ కాదు, అయినప్పటికీ ఇది పెర్ఫార్మెన్స్ మరియు ఇంజన్ పనితీరు పరంగా ఈ విభాగంలోని 350సిసి బైక్‌లతో పోటీపడుతుంది. బజాజ్ డొమినార్ 400 స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 373 సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది బజాజ్ ఆటో యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్. ఈ ఇంజన్ గరిష్టంగా 40 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీనిచ్చే మోటార్‌సైకిల్స్ ఏవో తెలుసా?

బజాజ్ డొమినార్ 400లో ఎల్‌ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్‌తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్, డబుల్ బారెల్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్ లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 ప్రారంభ ధర రూ.2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield Classic 350 Rivals Honda Hness 350, Jawa, Benelli Imperiale 400 And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X