క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన క్లాసిక్ 500 యొక్క లిమిటెడ్ ఎడిషన్ ట్రిబ్యూట్ మోడల్‌ను ఇప్పుడు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మార్కెట్లలో కూడా విడుదల చేయనుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

ఇది లిమిటెడ్ ఎడిషన్ కావడంతో, ఈ రెండు మార్కెట్ల కోసం కేవలం 240 యూనిట్లను మాత్రమే కంపెనీ ఎగుమతి చేయనుంది. వీటిలో 200 యూనిట్లు ఆస్ట్రేలియాలో విక్రయించనున్నారు. కాగా మిగిలిన 40 యూనిట్లను న్యూజిలాండ్ మార్కెట్లో విక్రయించనున్నారు. ఈ మార్కెట్లలో కంపెనీ ఇప్పటికే కొత్త క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ కోసం ప్రీ-ఆర్డర్లను కూడా స్వీకరిస్తోంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

ఆస్ట్రేలియా మార్కెట్లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ధర 9,590 ఆస్ట్రేలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.5.39 లక్షలు)గా ఉంది. జూన్ చివరి నాటికి ఈ బైక్ ఆస్ట్రేలియన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ప్రదర్శించబడుతుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

ఈ లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్ల కోసం కంపెనీ అదనంగా రెండు సంవత్సరాల వారంటీ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ ఈ కొత్త బైక్‌ను చెన్నైలో ఉన్న తమ ఒరగడమ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

కొత్త క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ పిన్‌స్ట్రైప్స్‌తో డిజైన్ చేసింది. చేతితో తయారు చేయబడిన ఈ గీతల్ని 'మద్రాస్ స్ట్రైప్స్'గా పిలుస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లపై ఓ విశిష్టమైన సీరియల్ నంబర్ కూడా ఉంటుంది. ప్రతి సీరియల్ నెంబర్ కూడా దాని ప్రొడక్షన్ సంఖ్యను తెలియజేస్తుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ 500సిసి బైక్‌ను కన్స్ట్రక్షన్ ఇంజన్ (యుసిఇ)తో వతొలిసారిగా 2008లో ప్రారంభించింది. ఇందులోని 499 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 27.2 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ పేరుకు తగినట్లుగానే మొత్తం బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది. ఈ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ప్రీమియం లెదర్ రైడర్ మరియు పిలియన్ సీట్లతో వస్తుంది.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

భారతదేశంలో బిఎస్6 ఉద్గార నియమాలను అమలు చేసిన తరువాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో తమ మొత్తం 500సిసి బైక్‌లను నిలిపివేసింది. ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 350 సిసి మరియు 650 సిసి బైక్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్; కేవలం 240 యూనిట్లు మాత్రమే

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో మరో కొత్త 350 సిసి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క జే-ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త మోడల్ రూపుదిద్దుకోనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal Enfield Classic 500 Tribute Black Limited Edition Launched In Australia. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X