కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'హిమాలయన్'లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త మోడల్‌కి సంబంధించిన ధర, ఇందులో చేసిన ఇతర మార్పులు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లు మరియు కలర్ ఆప్షన్లతో రానుంది. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

తాజాగా, బుల్లెట్ గురు అనే యూట్యూబ్ వీడియోలో షేర్ చేసిన చిత్రాలు, బ్రాండ్ యొక్క 'మేక్-ఇట్-యువర్స్' యాప్ నుండి కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఇందులో కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర రూ.2.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కనిపిస్తుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

అయితే, ఈ కస్టమైజ్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌కు ఇరువైపులా పాన్నీర్ (లగేజ్ క్యారియర్స్) సెటప్ చేయబడి ఉంటుంది. అందువల్లనే దీని రేట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రోడక్ట్ ఇంత కన్నా తక్కువ ధరకే విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

హిమాలయన్ ఫేస్‌లిఫ్ట్ మోటార్‌సైకిల్ లైనప్‌లో చేర్చబడే కొత్త రంగులను కూడా ఈ వీడియోలో వెల్లడించారు. ఇందులో పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్ మరియు గ్రానైట్ బ్లాక్ ఉన్నాయి. ఇందులో కొత్త కలర్స్‌ని చేర్చడంతో పాటుగా, పాత కలర్ ఆప్షన్లలో కొన్నింటినీ కంపెనీ నిలిపివేయనుంది. లేక్ బ్లూ, గ్రావెల్ గ్రే మరియు రాక్ రెడ్ కలర్స్‌ని మాత్రం అలానే ఉంచారు.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

ఈ కొత్త పెయింట్ స్కీమ్‌తో పాటుగా బ్రౌన్ కలర్ స్కీమ్‌లో ఫినిష్ చేసిన సీట్లను కూడా ఇందులో చేర్చారు. అలాగే, రైడర్ కంఫర్ట్ కోసం ఇందులోని సీట్‌ను కూడా ఇప్పుడు మరింత దృఢమైన ఫోమ్‌తో సౌకర్యంగా ఉండేలా మార్చారు. ఎత్తైన రైడర్లను దృష్టిలో ఉంచుకొని, ముందు వైపు ఫుట్ ర్యాక్‌ని కూడా కంపెనీ రీడిజైన్ చేశారు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

అదనపు లగేజ్‌ను క్యారీ చేయటం కోసం దీని ముందు మరియు వెనుక లగేజ్ క్యారియర్లలో మార్పులు చేశారు. రైడర్ మోకాలితో సంబంధాన్ని నివారించడానికి ఈ కొత్త మోటారుసైకిల్ ముందు భాగంలో తక్కువ క్యారియర్ ఉంటుంది. వెనుక భాగంలో, సామాను రాక్ ఇప్పుడు మంచి లోడ్ మోయడానికి ఫ్లాట్ మెటల్ ప్లేట్‌ను కలిగి ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది పొడవు తక్కువగా ఉంటుంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

కొత్త హిమాలయన్ మోడల్‌లో ఇప్పుడు రైడర్‌పై వాయు పీడనాన్ని తగ్గించడానికి ఇందులో మరింత పొడవైన విండ్‌షీల్డ్‌ను జోడించారు. అలాగే, కస్టమైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా రైజర్లు కావాలనుకుంటే, తమ కొత్త హిమాలయన్ మోటార్‌సైకిల్ కోసం స్మోక్డ్ విండ్‌స్క్రీన్ ఆప్షన్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

పైన పేర్కొన్న మార్పులతో పాటు, కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే, ఈ ఫీచర్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసిన మీటియోర్ 350 క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో అందిస్తున్నారు. ఈ ఫీచర్ కారణంగా, ఇది పూర్తి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

ఈ బైక్‌పై సుదూర ప్రయాణాలు, కొత్త ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రైడర్లు తమ మొబైల్ ఫోన్ సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయి టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను పొందవచ్చు. అంతేకాకుండా, మరిన్ని ఇతర వివరాలను కూడా రిమోట్‌గా తెలుసుకోవచ్చు.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ధర ఎంతంటే..?

పైన పేర్కొన్న మార్పుల మినహా, కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇందులోని 411సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Source: Bullet Guru

Most Read Articles

English summary
Royal Enfield Himalayan Facelift Price And Changes Leaked Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X