రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మరింత శక్తివంతమైనదైతే.. ఎలా అనుకుంటున్నారా.. ఈ వీడియో చూడండి

మార్కెట్లో ఎక్కువమంది వాహనప్రియులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే బైకులు ఏవి అంటే.. అవి Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్) అంతంలో ఎటువంటి సందేహం లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ అందరికి నచ్చిన మరియు మెచ్చిన బైక్ బ్రాండ్. అయితే ఎక్కువమంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలుదారులు తమకు నచ్చిన విధంగా మాడిఫైడ్ చేసుకుంటారు. అంతే కాదు తమకు నచ్చినట్లు మాడిఫైడ్ చేసుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు చాలా అనుకూలంగా ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్

మనం ఇదివరకే చాలా కథనాల్లో మాడిఫైడ్ చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు, ఇక్కడ మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ 'ప్రాజెక్ట్‌ HT500' పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ యొక్క మాడిఫికేషన్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మొత్తం ఎన్‌ఎమ్‌డబ్ల్యు ఇంటెర్ప్రైజెస్ బెంగుళూరులో జరిగింది. ఇప్పటికే దీనికి సంబందించిన 'సిరీస్ 1' వీడియో అందుబాటులో ఉంది. ఇప్పుడు 'సిరీస్ 2' వీడియో మీ ముందుకు వచ్చింది.

ఈ వీడియోలో మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మాడిఫికేషన్ గురించి వివరిస్తుంది. ప్రాజెక్ట్ HT500 కింద, మేము హిమాలయన్ ఇంజిన్‌ను మరింత శక్తివంతమైన 499 సిసి గా చేయబోతున్నాము. ఇందులో పెద్ద బోర్ కిట్, పెద్ద పిస్టన్, పెద్ద వాల్వ్‌లు, కొత్త ECU ఉంటుంది. దీనికి సంబందించిన వీడియో మీరు ఈ కింద చూడవచ్చు.

వాహన ప్రియుల యొక్క అభిరుచిని పెంచడానికి మేము ఈ సమాచారం అందిస్తున్నాము. దీనికి సంబందించిన మొదటి ఎపిసోడ్‌లో అన్ని భాగాలు ఎలా బయటకు తీయబడ్డాయి మరియు ఎలా మార్పులు చేయబడ్డాయి అని తెలియజేశాము. ఇప్పుడు ఈ రెండవ ఎపిసోడ్‌లో, మేము మాడిఫైడ్ చేసిన ఇంజిన్‌ను హిమాలయానికి తిరిగి ఇస్తున్నాము, కావున ఈ బైక్ ఇప్పుడు గతంలో కంటే బలంగా మరియు మరింత శక్తివంతంగా తయారు చేస్తున్నాము.

మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క హిమాలయన్ అత్యంత ప్రాచుర్యం పొందింది బైక్. కావున వాహన ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ బైక్ మరింత శక్తివంతమైనది అయితే, వారి ఆనందానికి అవధులు ఉండవు. మేము చేసిన ఈ ప్రక్రియ వల్ల ఈ బైక్ ఇప్పుడు మరింత శక్తితమైనదిగా మారుతుందని ఖచ్చితంగా చెబుతున్నాము.

Most Read Articles

English summary
Royal enfield himalayan 500cc project video part 2
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X